నేడు తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు

|

Mar 12, 2019 | 8:23 AM

హైదరాబాద్‌: తెలంగాణలో శాసనసభ్యుల కోటాలో అయిదు శాసనమండలి స్థానాలకు మంగళవారం ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్‌ ఎన్నికలు బహిస్కరించినందున ప్రథమ ప్రాధాన్య క్రమంలోనే తెరాస, మజ్లిస్‌ సభ్యులు గెలవడం ఖాయమైంది. మండలి ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రిటర్నింగ్‌ అధికారి వి.నరసింహాచార్యులు తెలిపారు. పోలింగ్‌ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ ఎన్నికలకు సంబంధించి మొదటి నుంచి అనూహ్య పరిణామాలు సంభవిస్తున్నాయి. […]

నేడు తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు
Follow us on

హైదరాబాద్‌: తెలంగాణలో శాసనసభ్యుల కోటాలో అయిదు శాసనమండలి స్థానాలకు మంగళవారం ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్‌ ఎన్నికలు బహిస్కరించినందున ప్రథమ ప్రాధాన్య క్రమంలోనే తెరాస, మజ్లిస్‌ సభ్యులు గెలవడం ఖాయమైంది. మండలి ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రిటర్నింగ్‌ అధికారి వి.నరసింహాచార్యులు తెలిపారు. పోలింగ్‌ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ ఎన్నికలకు సంబంధించి మొదటి నుంచి అనూహ్య పరిణామాలు సంభవిస్తున్నాయి. అయిదు స్థానాలకుగాను తెరాస నాలుగింట పోటీ చేస్తూ, ఒక స్థానాన్ని మిత్రపక్షమైన మజ్లిస్‌కు కేటాయించింది. కాంగ్రెస్‌ కూడా అభ్యర్థిని బరిలోకి దింపింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కొందరు తెరాసలో చేరుతున్నట్టు ప్రకటించడంతో పోలింగుకు ఒక రోజు ముందు కాంగ్రెస్‌ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు వెల్లడించింది.

ఈ పరిస్థితుల్లో గెలుపు నల్లేరుపైనడకే అయినా తెరాస పూర్తిస్థాయి బలంతో రంగంలోకి దిగనుంది. పార్టీ ఎమ్మెల్యేలకు సోమవారం మాక్ పోలింగ్ కూడా నిర్వహించింది. మంగళవారం ఉదయం మరోసారి మాక్ పోలింగ్ నిర్వహించనుంది. తెరాసకు ప్రస్తుతం 91 మంది సొంత సభ్యుల బలంతో పాటు మిత్రపక్షమైన మజ్లిస్‌ నుంచి ఏడుగురు సభ్యుల మద్దతు ఉంది. తెదేపానుంచి సండ్ర వెంకటవీరయ్య, కాంగ్రెస్‌ నుంచి రేగకాంతారావు, ఆత్రం సక్కు, చిరుమర్తి లింగయ్య, హరిప్రియలు తెరాసలో చేరుతున్నట్లు ప్రకటించారు. సబితాఇంద్రా రెడ్డి కూడా తెరాసకు మద్దతిచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది.