మరో నాలుగేళ్లలో తెలంగాణాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని జోస్యం చెప్పారు ఈ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్.. 2023 లో ఇక్కడ కమలం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. నిజామాబాద్ లో బీజేపీ నేత ధర్మపురి అరవింద్ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఇక్కడ మధ్యంతర ఎన్నికలు జరిగిన పక్షంలో తమ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుని పవర్లోకి వస్తుందన్నారు. తెలంగాణాలో బీజేపీ బలం పుంజుకున్నదని చెప్పిన రామ్ మాధవ్.. పశ్చిమ బెంగాల్ లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీపై ‘ పోరాటం ‘ చేస్తున్న మీ ‘ సహచరులను ‘ (బీజేపీ కార్యకర్తలను) చూసి ఇక్కడ మీరు కూడా తెరాస ప్రభుత్వంపై అదేవిధంగా ఎలుగెత్తాలని పిలుపునిచ్చారు. కేసీఆర్, చంద్రబాబు కేంద్రంలో చక్రం తిప్పాలనుకున్నారని, కానీ వారి ఆశలు ఫలించలేదన్నారు. తెలంగాణా బీజేపీ శాఖ తోడ్పాటు వల్లే కమలం పార్టీ జాతీయ స్థాయిలో 300 కు పైగా సీట్లు గెలుచుకోగలిగిందని రామ్ మాధవ్ పేర్కొన్నారు.
గతంతో పోలిస్తే తెలంగాణాలో’ కమలం ‘ బాగా వికసించిందని ఆయన అన్నారు.