ఎ౦పి టికెట్లు ఆశిస్తున్న పలువురు తెల౦గాణ ఎన్నారైలు

| Edited By:

Oct 18, 2020 | 9:05 PM

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణ౦లో పలువురు తెలంగాణ ఎన్నారైలు రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు యత్నిస్తున్నారు. తెలంగాణలో త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో తమకు పార్టీ టికెట్ కావాలని కోరుతూ పలువురు ఎన్నారైలు దరఖాస్తులు సమర్పించారు. తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలుండగా అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్  పార్టీల తరపున ఎన్నికల బరిలోకి దిగేందుకు పలువురు ఎన్నారైలు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఎన్నారైలు పార్టీ టికెట్లు ఇస్తే వారే ప్రచార ఖర్చు భరిస్తారని పలు పార్టీలు టికెట్లు వారికి ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం. […]

ఎ౦పి టికెట్లు ఆశిస్తున్న పలువురు తెల౦గాణ ఎన్నారైలు
Follow us on

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణ౦లో పలువురు తెలంగాణ ఎన్నారైలు రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు యత్నిస్తున్నారు. తెలంగాణలో త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో తమకు పార్టీ టికెట్ కావాలని కోరుతూ పలువురు ఎన్నారైలు దరఖాస్తులు సమర్పించారు.

తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలుండగా అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్  పార్టీల తరపున ఎన్నికల బరిలోకి దిగేందుకు పలువురు ఎన్నారైలు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఎన్నారైలు పార్టీ టికెట్లు ఇస్తే వారే ప్రచార ఖర్చు భరిస్తారని పలు పార్టీలు టికెట్లు వారికి ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ఆర్ఐ శానంపూడి సైదిరెడ్డి హుజూర్ నగర్ నుంచి ఉత్తం కుమార్ రెడ్డిపై పోటీ చేసి ఓటమి చవిచూశారు. యూకేకు చెందిన మరో ఎన్ఆర్ఐ డాక్టర్ పగిడిపాటి దేవయ్య వర్ధన్నపేట నుంచి తెలంగాణ జనసమితి పక్షాన పోటీ చేసి ఓడిపోయారు.

అమెరికాకుకు చెందిన మరో తెలంగాణ ఎన్ఆర్ఐ జలగం సుధీర్ నల్గొండ టీఆర్ఎస్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ యూఎస్ శాఖ సంయుక్త కార్యదర్శి అయిన సుక్రూ నాయక్ కూడా నల్గొండ టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. యూకేకు చెందిన గంపా వేణుగోపాల్ మెదక్ కాంగ్రెస్ టికెట్ కోసం యత్నిస్తున్నారు. గల్ప్ ఎన్ఆర్ఐ అసోసియేషన్ అధ్యక్షుడు అయిన జువ్వాడి శ్రీనివాసరావు చేవేళ్ల లేదా మల్కాజిగిరి సీటు కోసం యత్నిస్తున్నారు. త్వరలో తెలంగాణలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో పలువురు తెలంగాణ ఎన్నారైలు పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.