రేపటి నుంచి రోడ్డెక్కనున్న బస్సులు, ఆటోలు..

తెలంగాణలో మే 31 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. హైదరాబాద్ తోసహా అన్ని ప్రాంతాల్లో అన్ని షాపులూ తెరచుకోవచ్చని తెలిపారు. హైదరాబాద్‌లో రోజు విడిచి రోజు కార్యకలాపాలు సాగుతాయని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా రవాణా వ్యవస్థను పునరుద్ధరిస్తున్నట్లు స్పష్టం చేసారు ముఖ్యమంత్రి. మంగళవారం ఉదయం నుంచే రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు తిరుగుతాయన్నారు. సిటీ బస్సులకు మాత్రం అనుమతి ఇవ్వడంలేదన్నారు. అంతర్రాష్ట్ర బస్సులకు కూడా అనుమతి లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇక హైదరాబాద్‌లో ఆటోలు, […]

రేపటి నుంచి రోడ్డెక్కనున్న బస్సులు, ఆటోలు..

Edited By: Pardhasaradhi Peri

Updated on: May 18, 2020 | 8:47 PM

తెలంగాణలో మే 31 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. హైదరాబాద్ తోసహా అన్ని ప్రాంతాల్లో అన్ని షాపులూ తెరచుకోవచ్చని తెలిపారు. హైదరాబాద్‌లో రోజు విడిచి రోజు కార్యకలాపాలు సాగుతాయని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా రవాణా వ్యవస్థను పునరుద్ధరిస్తున్నట్లు స్పష్టం చేసారు ముఖ్యమంత్రి.
మంగళవారం ఉదయం నుంచే రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు తిరుగుతాయన్నారు. సిటీ బస్సులకు మాత్రం అనుమతి ఇవ్వడంలేదన్నారు.
అంతర్రాష్ట్ర బస్సులకు కూడా అనుమతి లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
ఇక హైదరాబాద్‌లో ఆటోలు, క్యాబ్‌లు తిరుగుతాయని.. ఐతే డ్రైవర్‌‌తో పాటు ముగ్గురికి మాత్రమే అనుమతి ఉంటుంది. ప్రభుత్వ నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు. మెట్రో రైలు సర్వీసులు పనిచేయవు.