‘సజ్జల జీతం 3 లక్షలు, 16 నెలలుగా ఏ సలహాలిచ్చారో చెప్పాలి’

|

Sep 22, 2020 | 12:44 PM

అమరావతి రాజధాని భూముల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ వేసిన కేబినెట్ సబ్ కమిటీ ఏమి తేల్చిందని టీడీపీ నేత బొండా ఉమ ప్రశ్నించారు.16 నెలలు కమిటీలతో కాలయాపన చేశారని.. ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టలేదని విమర్శించారు. ఏపీ ప్రభుత్వ సలహాదారుగా నియమించి సజ్జల రామకృష్ణారెడ్డికి నెలకి మూడు లక్షల రూపాయల జీతం ఇస్తున్నారని.. ప్రభుత్వ సలహాదారుగా ఆయన ఈ 16 నెలల్లో ఏమి సలహాలు ఇచ్చారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అమరావతిలో రాజధాని […]

సజ్జల జీతం 3 లక్షలు, 16 నెలలుగా ఏ సలహాలిచ్చారో చెప్పాలి
Follow us on

అమరావతి రాజధాని భూముల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ వేసిన కేబినెట్ సబ్ కమిటీ ఏమి తేల్చిందని టీడీపీ నేత బొండా ఉమ ప్రశ్నించారు.16 నెలలు కమిటీలతో కాలయాపన చేశారని.. ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టలేదని విమర్శించారు. ఏపీ ప్రభుత్వ సలహాదారుగా నియమించి సజ్జల రామకృష్ణారెడ్డికి నెలకి మూడు లక్షల రూపాయల జీతం ఇస్తున్నారని.. ప్రభుత్వ సలహాదారుగా ఆయన ఈ 16 నెలల్లో ఏమి సలహాలు ఇచ్చారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

అమరావతిలో రాజధాని ప్రకటన తర్వాత 127 ఎకరాలు మాత్రమే రిజిస్ట్రేషన్ జరిగితే.. రెండు లక్షల కోట్లు అవినీతి జరిగిందని ప్రచారం చేశారని బొండా విమర్శించారు. అమరావతి రాజధానిగా ప్రకటించిన తర్వాత అక్రమాలు జరగలేదన్న ఆయన.. విశాఖలో వైసీపీ వన్ సైడర్ ట్రేడింగ్ చేసిందని ఆరోపించారు. విశాఖలో 75 వేల ఎకరాలు పైగా వన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని. అమరావతి, విశాఖ భూముల ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సీబీఐ విచారణ జరిపించాలని టీడీపీ నేత డిమాండ్ చేశారు.