ఏపీలో 80% పోలింగ్.. ఇది దేనికి సంకేతం..?

|

Apr 12, 2019 | 9:20 PM

అమరావతి: ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. కొన్ని చోట్ల ఉద్రికత్తల మినహా.. మిగిలిన ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఇది ఇలా ఉంటే అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ ఎప్పుడూ లేనంతగా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తీవ్ర ఉద్రిక్తతల మధ్య ముగిసిన ఏపీ ఎన్నికల్లో విజయం ఎవరిదన్న విషయంలో.. టీడీపీ.. జగన్ పార్టీలు రెండూ తమదంటే.. తమదన్నట్లుగా వ్యవహరించటం జరుగుతోంది. ఏపీలో ఈసారి 80 శాతం పోలింగ్ జరగడంతో ఈ రెండు పార్టీలు ఇదే కారణాన్ని […]

ఏపీలో 80% పోలింగ్.. ఇది దేనికి సంకేతం..?
Follow us on

అమరావతి: ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. కొన్ని చోట్ల ఉద్రికత్తల మినహా.. మిగిలిన ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఇది ఇలా ఉంటే అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ ఎప్పుడూ లేనంతగా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తీవ్ర ఉద్రిక్తతల మధ్య ముగిసిన ఏపీ ఎన్నికల్లో విజయం ఎవరిదన్న విషయంలో.. టీడీపీ.. జగన్ పార్టీలు రెండూ తమదంటే.. తమదన్నట్లుగా వ్యవహరించటం జరుగుతోంది.

ఏపీలో ఈసారి 80 శాతం పోలింగ్ జరగడంతో ఈ రెండు పార్టీలు ఇదే కారణాన్ని గెలుపునకు చూపిస్తున్నాయి. తమ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని టీడీపీ నమ్మకంగా చెబుతుంటే.. ప్రభుత్వ వైఫల్యం.. బాబు మీద ఉన్న వ్యతిరేకత తమకు విజయం చేకూరిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు జగన్ పార్టీ నేతలు.

జగన్ పార్టీ నేతల వాదన…

ప్రభుత్వ వ్యతిరేకతతోనే 80% పోలింగ్ కు సాధ్యమవుతుందని జగన్ నేతలు అంటున్నారు. బాబు సర్కారులో నెలకొన్న అవినీతి వల్ల జగన్ కు ఒక్కసారి అవకాశం ఇస్తే తప్పేంటని ఏపీ ప్రజలు భావిస్తున్నారని వారి మాట. టీడీపీ ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత, ప్రత్యేక హోదాపై మొదటి నుంచి మేము ఒకే మాట మీద నిలబడటం వంటివి మా విజయానికి దోహదపడతాయని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇక ఎక్కువగా ఓటు వేసేందుకు దూర ప్రాంతాల నుంచి రావడంతో ఈ ఎన్నికల్లో మేము తప్పకుండా గెలుస్తామని జగన్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

టీడీపీ పార్టీ నేతల వాదన…

జగన్ గెలిస్తే ఏపీ రాజధాని.. డెవలప్ మెంట్ పనులు ఆగిపోతాయని, అనుభవం ఉన్న బాబు చేతుల్లోనే ఏపీ సురక్షితంగా ఉంటుందని ప్రజలు భావిస్తున్నారని టీడీపీ నేతల వాదన. ఐదేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, ఏపీకి ఉమ్మడి శత్రువులైన మోదీ.. కేసీఆర్ లతో జగన్ కలవడం వంటి అంశాలతో ప్రజలు మావైపు ఉన్నారని వారు అంటున్నారు. జగన్ రాకూడదనే పెద్ద ఎత్తున పోలింగ్ జరిగిందని తమ్ముళ్ల మాట. నన్ను చూసి ఓట్లు వేయాలంటూ చంద్రబాబు చేసిన అభ్యర్ధనతోనే హైదరాబాద్.. తమిళనాడు.. కర్ణాటకలో ఉన్న వారు ఓటింగ్ కు రావటం జరిగిందని టీడీపీ నేతల వాదన. అయితే వీరిద్దరి వాదనలలో ఎవరు కరెక్ట్  అనేది తెలియాలంటే మే23 వరకు వేచిచూడాల్సిందే.