AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నకిలీ వార్తల నియంత్రణపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. ట్విట్టర్‌, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ

ఫేక్‌న్యూస్‌పై చర్యలు తీసుకోకపోవడంపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వానికి, సోషల్ మీడియా సంస్థ ట్విటర్‌‌కు కోర్టు నోటీసులు జారీ చేసింది.

నకిలీ వార్తల నియంత్రణపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. ట్విట్టర్‌, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ
Balaraju Goud
|

Updated on: Feb 12, 2021 | 1:33 PM

Share

Supreme Court notice : కేంద్ర ప్రభుత్వానికి, సోషల్ మీడియా సంస్థ ట్విటర్‌‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. విద్వేషాన్ని వ్యాప్తి చేసే ప్రకటలు, ఫేక్‌ ఖాతాలు, నకిలీ వార్తలను, ట్విటర్‌ కంటెంట్‌ను నియంత్రించేలా ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రముఖ వ్యక్తులు, ప్రముఖుల పేరిట వందలాది నకిలీ ట్విట్టర్ హ్యాండిల్స్, ఫేస్‌బుక్ ఖాతాలు ఉన్నాయని, వాటిపై తక్షణమే చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోరుతూ బీజేపీ నేత వినిత్ గోయెంకా సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. గత ఏడాది మేలో దాఖలు చేసిన పిటిషన్‌‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ మేరకు నోటుసులు ఇచ్చింది.

ఈ సందర‍్భంగా ఫేక్‌న్యూస్‌పై చర్యలు తీసుకోకపోవడంపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధాన న్యాయమూర్తి బొబ్డే నేతృత్వంలోని ధర్మాసనం సోషల్ మీడియా నియంత్రణ కోరుతూ పెండింగ్‌లో ఉన్న పిటిషన్లకు దీన్ని ట్యాగ్ చేయాలని కూడా ఆదేశించింది. సోషల్ మీడియా ద్వారా, ముఖ్యంగా ట్విట్టర్ ద్వారా ప్రసారం అవుతున్న నకిలీ వార్తలు, విద్వేషాలు ప్రేరేపించే సందేశాలను తనిఖీ చేయడానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని వినిత్ గోయెంకా తన పిటిషన్‌లో పేర్కొన్నారు. పిటిషనర్ తరఫున హాజరైన న్యాయవాది అశ్విని కుమార్ దుబే, ట్విట్టర్‌లో ద్వేషపూరిత ప్రకటనలు, భారత వ్యతిరేక విషయాలను నిఘా కోసం ఓ యంత్రాంగాన్ని నియమించాలని సుప్రీంకోర్టును కోరారు. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం ట్విట్టర్‌తో పాటు కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది.

మరోవైపు, కేంద్ర ప్రభుత్వం, ట్విట్టర్ సంస్థ మధ్య వివాదం కొనసాగుతుంది. రైతు ఉద్యమం నేపథ్యంలో పలువురు న‌కిలీ వార్తల ద్వారా విద్వేషాన్ని రెచ్చగొట్టుతున్న కొన్ని ట్విటర్‌ ఖాతాలను రద్దు చేయాలని కేంద్రం ఇటీవల ట్విటర్‌ను కోరింది. అయితే, ఇది భావస్వేచ్ఛకు భంగమంటూ మీడియా, జర్నలిస్టులు తదితర కొన్ని ఖాతాలను బ్యాన్‌ చేసేందుకు ట్విటర్‌ నిరాకరించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఐటీ శాఖ ట్విటర్‌కు ప్రత్యామ్నాయంగా దేశీయ ట్విటర్‌ ‘కూ’ యాప్‌ను ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే.

Read Also…  PM Narendra Modi: 14న చెన్నైలో ప్రధాని నరేంద్రమోదీ పర్యటన.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్