Breaking news కుప్పకూలిన స్టాక్ మార్కెట్

|

May 04, 2020 | 1:34 PM

దేశంలో కరోనా వైరస్ ప్రబలినప్పట్నుంచి ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న స్టాక్ మార్కెట్ సోమవారం ఉదయం భారీ ఎత్తున కుప్పకూలింది. సెన్సెక్స్ 1800 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ మరో 500 పాయింట్లు కోల్పోయింది.

Breaking news కుప్పకూలిన స్టాక్ మార్కెట్
Follow us on

దేశంలో కరోనా వైరస్ ప్రబలినప్పట్నుంచి ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న స్టాక్ మార్కెట్ సోమవారం ఉదయం భారీ ఎత్తున కుప్పకూలింది.
సెన్సెక్స్ 1800 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ మరో 500 పాయింట్లు కోల్పోయింది. ఆసియా ఖండానికి చెందిన పలు మార్కెట్లతో పాటు ఐరోపా ఖండంలోని స్టాక్ మార్కెట్లు కూడా సోమవారం పతనం అంచుకు చేరాయి.

బ్యాంకులు, ఆటోమొబైల్ రంగాలకు సంబంధించిన షేర్లు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. సోమవారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలోనే సుమారు ఏడు శాతం నష్టంతో బ్యాంకులు, ఆటోమొబైల్ రంగాలకు సంబంధించిన షేర్లు ట్రేడింగ్ ప్రారంభించాయి. ఆ తర్వాత అదే నష్టం మధ్యాహ్నం వరకు కొనసాగింది.

సమీప భవిష్యత్తులో ఆటోమొబైల్ రంగానికి సంబంధించిన అమ్మకాలు పుంజుకోవడం అసాధ్యం అన్న వార్తల నేపథ్యంలో స్టాక్ మార్కెట్‌కు పెద్ద దెబ్బ తగిలిందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. బ్యాంకులకు రావాల్సిన రుణాల చెల్లింపు కూడా మరింత ఆలస్యమయ్యే సంకేతాలు కూడా బ్యాంకుల షేర్లకు దెబ్బ కొట్టిందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.