మహారాష్ట్రకు అదనపు నిధులు కావాలి.. శరద్ పవార్

తమ రాష్ట్రానికి అదనపు నిధుల అవసరం ఎంతయినా ఉందని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. లాక్ డౌన్ అనంతరం దేశ ఆర్ధిక పునరుజ్జీవంలో రాష్ట్రాలు కీలక పాత్ర వహిస్తాయని ఆయన చెప్పారు. ఆర్ధిక సాయం లేనిదే రాష్ట్ర ప్రభుత్వాలు..

మహారాష్ట్రకు అదనపు నిధులు కావాలి.. శరద్ పవార్

Edited By:

Updated on: Apr 26, 2020 | 8:28 PM

తమ రాష్ట్రానికి అదనపు నిధుల అవసరం ఎంతయినా ఉందని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. లాక్ డౌన్ అనంతరం దేశ ఆర్ధిక పునరుజ్జీవంలో రాష్ట్రాలు కీలక పాత్ర వహిస్తాయని ఆయన చెప్పారు. ఆర్ధిక సాయం లేనిదే రాష్ట్ర ప్రభుత్వాలు.. కరోనాను కట్టడి చేయడానికి కేంద్రం చేస్తున్న ప్రయత్నాలకు తోడ్పడలేవని ఆయన కుండబధ్ధలు కొట్టారు. ఈ ఆర్థిక సంవత్సరానికి అదనంగా మహారాష్ట్రకు లక్ష కోట్ల అదనపు నిధులైనా అవసరమని శరద్ పవార్ అభిప్రాయపడ్డారు. ఎకనమిక్ యాక్టివిటీ లేనిదే రాష్టాల ఆదాయాలు గణనీయంగా పడిపోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే తమ రాష్ట్ర ఆదాయం చాలావరకు తగ్గిందని, కరోనా మహమ్మారి కారణంగా ద్రవ్య లోటును ఎదుర్కొనే పరిస్థితి ఉందని ఆయన చెప్పారు. తమ డిమాండుకు సంబంధించి ఆయన కేంద్రానికి లేఖ రాశారు. తమ లాగే అనేక రాష్ట్రాలు కేంద్ర సాయానికి ఎదురు చూస్తున్నట్టు శరద్ పవార్ పేర్కొన్నారు.