‘నా గురించి అన్నీ తప్పుడు కథనాలే’.. సింగర్ కనికా కపూర్

తన గురించి, తన ట్రావెల్ టైం గురించి, తన కరోనా వ్యాధి గురించి అన్నీ తప్పుడు సమాచారమే బయటికొచ్చిందని బాలీవుడ్ సింగర్  కనికా కపూర్ తెలిపింది. కరోనా నుంచి పూర్తిగా కోలుకుని లక్నో లోని ఓ ఆసుపత్రి నుంచి ఇటీవలే డిశ్చార్జ్ అయిన ఈమె ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ..

'నా గురించి అన్నీ తప్పుడు కథనాలే'.. సింగర్ కనికా కపూర్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Apr 27, 2020 | 10:30 AM

తన గురించి, తన ట్రావెల్ టైం గురించి, తన కరోనా వ్యాధి గురించి అన్నీ తప్పుడు సమాచారమే బయటికొచ్చిందని బాలీవుడ్ సింగర్  కనికా కపూర్ తెలిపింది. కరోనా నుంచి పూర్తిగా కోలుకుని లక్నో లోని ఓ ఆసుపత్రి నుంచి ఇటీవలే డిశ్చార్జ్ అయిన ఈమె ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. .. మార్చి నెలలో లండన్ నుంచి తను ముంబైలో దిగినప్పుడు అసలు స్క్రీనింగ్ పరీక్షే జరగలేదని, కానీ కరోనా పాజిటివ్ లక్షణాలు దాచిపెట్టానని తనపై కేసు నమోదు చేశారని వాపోయింది. ముంబై నుంచి లక్నో చేరుకున్నప్పుడు కూడా తనకు ఎలాంటి పాజిటివ్ లక్షణాలు లేవని, అందుకే ప్రముఖులకు డిన్నర్ ఇచ్చానని  ఆమె పేర్కొంది, తన డిన్నర్ కి హాజరైనవారందరికీ నెగెటివ్ రిపోర్టు వఛ్చిన విషయాన్ని కనికా కపూర్ గుర్తు చేసింది. ఆ తరువాతే కరోనా జ్వరంతో ఆసుపత్రిలో చేరానని, 21 రోజుల పాటు క్వారంటైన్ లో ఉన్నానని వెల్లడించింది. తనకు ఆరో సారి నెగెటివ్ వఛ్చిన విషయాన్ని  కనికా తెలియజేస్తూ.. నాకు ఎంతో శ్రధ్దతో చికిత్స చేసిన డాక్టర్లకు, ఇతర వైద్యసిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతున్నానని వెల్లడించింది. నిజ నిరూపణకు తగినంత వ్యవధిని ఇచ్చేందుకే ఇన్నాళ్లూ పెదవి విప్పలేదని కనికా కపూర్ అన్నారు. నేను వ్యాధి లక్షణాలు దాచిపెట్టాననడం పూర్తిగా వాస్తవ విరుధ్ధం అని ఆమె మరోసారి చెప్పారు. ఇది మళ్ళీ తనకు పునర్జన్మ అని అభివర్ణించారు.

మీ లవర్‌ను ఆకట్టుకోవాలనుకుంటున్నారా..? బెస్ట్ చిట్కాలు మీ కోసమే..
మీ లవర్‌ను ఆకట్టుకోవాలనుకుంటున్నారా..? బెస్ట్ చిట్కాలు మీ కోసమే..
మాయా లేదు.. మంత్రం లేదు, ఈ ఫొటో మీరు ఎలాంటి వారో కనిపెట్టేస్తుంది
మాయా లేదు.. మంత్రం లేదు, ఈ ఫొటో మీరు ఎలాంటి వారో కనిపెట్టేస్తుంది
గుడ్‌ న్యూస్‌.. గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీ పెంపు
గుడ్‌ న్యూస్‌.. గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీ పెంపు
ఈ రెండు విటమిన్లు లోపిస్తే క్యాన్సర్‌ ముప్పు తప్పదు..
ఈ రెండు విటమిన్లు లోపిస్తే క్యాన్సర్‌ ముప్పు తప్పదు..
తొలిసారి మిస్ యూనివ‌ర్స్ పోటీల్లో పాల్గొనాల‌ని సౌదీ నిర్ణ‌యం
తొలిసారి మిస్ యూనివ‌ర్స్ పోటీల్లో పాల్గొనాల‌ని సౌదీ నిర్ణ‌యం
ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన ఆవుగా రికార్డ్‌
ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన ఆవుగా రికార్డ్‌
టికెట్‌ అడిగిన ప్యాసింజర్‌.. చెంప పగలగొట్టిన కండక్టర్‌
టికెట్‌ అడిగిన ప్యాసింజర్‌.. చెంప పగలగొట్టిన కండక్టర్‌
బుడి బుడి అడుగుల చిన్నారి.. ఎవరెస్ట్‌నే ఎక్కేసిందిగా
బుడి బుడి అడుగుల చిన్నారి.. ఎవరెస్ట్‌నే ఎక్కేసిందిగా
టీచర్‌ను చెప్పులతో తరిమి కొట్టిన విద్యార్ధులు..ఎందుకో తెలుసా ??
టీచర్‌ను చెప్పులతో తరిమి కొట్టిన విద్యార్ధులు..ఎందుకో తెలుసా ??
ఈ చిన్నోడు హీరో.. కానీ వారికి విలన్.. ఎవరో గుర్తుపట్టగలరా ?..
ఈ చిన్నోడు హీరో.. కానీ వారికి విలన్.. ఎవరో గుర్తుపట్టగలరా ?..