బ్రేకింగ్: డీకే శివకుమార్‌కు కోర్టు షాక్.. 9 రోజుల కస్టడీకి ఆదేశాలు

| Edited By: Pardhasaradhi Peri

Sep 04, 2019 | 8:27 PM

కర్నాటక మాజీ మంత్రి డీకే శివకుమార్‌కు ఢిల్లీ ప్రత్యేక న్యాయస్ధానంలో చుక్కెదురైంది. 9 రోజుల కస్టడీకి అప్పగిస్తూ ఈడీ కోర్టు తీర్పు చెప్పింది. శివకుమార్ వేసిన బెయిల్ పిటిషన్ కూడా కోర్టు తోసిపుచ్చింది. మనీ లాండరింగ్ కేసులో డీకే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.సెప్టెంబర్ 13 వరకు ఈడీ కస్టడీలో ఉండనున్నారు డీకే. అయితే ఈడీ కస్టడీ విషయంలో ప్రత్యేక న్యాయస్ధానంలో వాడీవేడీ వాదనలు జరిగినా ప్రయోజనం లేకపోయింది. శివకుమార్‌ను ఈడీ అధికారులు టార్చర్ చేశారని, బుధవారం కనీసం భోజనం […]

బ్రేకింగ్:  డీకే శివకుమార్‌కు కోర్టు షాక్.. 9 రోజుల కస్టడీకి ఆదేశాలు
Follow us on

కర్నాటక మాజీ మంత్రి డీకే శివకుమార్‌కు ఢిల్లీ ప్రత్యేక న్యాయస్ధానంలో చుక్కెదురైంది. 9 రోజుల కస్టడీకి అప్పగిస్తూ ఈడీ కోర్టు తీర్పు చెప్పింది. శివకుమార్ వేసిన బెయిల్ పిటిషన్ కూడా కోర్టు తోసిపుచ్చింది. మనీ లాండరింగ్ కేసులో డీకే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.సెప్టెంబర్ 13 వరకు ఈడీ కస్టడీలో ఉండనున్నారు డీకే. అయితే ఈడీ కస్టడీ విషయంలో ప్రత్యేక న్యాయస్ధానంలో వాడీవేడీ వాదనలు జరిగినా ప్రయోజనం లేకపోయింది. శివకుమార్‌ను ఈడీ అధికారులు టార్చర్ చేశారని, బుధవారం కనీసం భోజనం కూడా పెట్టలేదని, ఆయననుక 14 రోజుల కస్టడీకి అప్పగిస్తే మరింత ఇబ్బందిపెడతారని శివకుమార్ న్యాయవాదులు వాదించారు.

డీకే ఇప్పటికే ఛాతీ నొప్పితో బాధపడుతున్నారు. అయినప్పటికీ ఆయనను హాస్పిటల్ నుంచి కోర్టుకు నేరుగా తీసుకొచ్చారు. ఆయన తరపున అభిషేక్ సింఘ్వీ కేసును వాదిస్తున్నారు. సింఘ్వీ వాదనతో ఈడీ తరపు న్యాయవాదులు విభేదించారు. శివకుమార్ ఐటీ చట్టాలను ఉల్లంఘించారని, ఆయన మనీల్యాండరింగ్‌కు పాల్పడ్డారని ఆరోపిస్తూ శివకుమార్‌ను లోతైన విచారణ జరపాలని న్యాయస్ధానంలో వాదించారు.

ఇదిలా ఉంటే శివకుమార్‌ అరెస్టును నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు దేశవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు చేపట్టాయి.వందలాది మంది యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు శివకుమార్‌కు మద్దతుగా రోడ్లపై బైఠాయించారు. పోలీసులు ఏర్పాటుచేసిన బారికేడ్లను సైతం తోసుకుంటూ ముందుకు వచ్చారు. వీరిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జీ చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు.