అసద్‌పై షబ్బీర్ ఫైర్..కారణమేంటో తెలుసా ?

|

Oct 25, 2019 | 1:22 PM

ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ విజయావకాశాలు దెబ్బ తీస్తూ బిజెపికి బీ టీమ్‌గా ఎంఐఎం పార్టీని అసదుద్దీన్ ఓవైసీ మార్చేశారని షబ్బీర్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. గాంధీ భవన్‌లో షబ్బీర్ అలీ మీడియాతో మాట్లాడారు. కొన్ని ఆసక్తికరమైన ఈక్వేషన్లను వివరించారు. అదే సమయంలో ఓవైసీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎంఐఎం పార్టీ మహారాష్ట్రలో 44 పోటీ చేసి 2 సీట్లు […]

అసద్‌పై షబ్బీర్ ఫైర్..కారణమేంటో తెలుసా ?
Follow us on

ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ విజయావకాశాలు దెబ్బ తీస్తూ బిజెపికి బీ టీమ్‌గా ఎంఐఎం పార్టీని అసదుద్దీన్ ఓవైసీ మార్చేశారని షబ్బీర్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. గాంధీ భవన్‌లో షబ్బీర్ అలీ మీడియాతో మాట్లాడారు. కొన్ని ఆసక్తికరమైన ఈక్వేషన్లను వివరించారు. అదే సమయంలో ఓవైసీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

ఎంఐఎం పార్టీ మహారాష్ట్రలో 44 పోటీ చేసి 2 సీట్లు గెలిచింది..మిగతా సీట్లలో బీజేపీ ,శివసేనను గెలిపించింది..ఇదీ షబ్బీర్ అలీ విశ్లేషణ. సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టి, మతతత్వ పార్టీ అయిన బిజెపిని ఎంఐఎం గెలిపించిందని షబ్బీర్ ఆరోపిస్తున్నారు. ముస్లింల ఓట్లు చీల్చడానికి ఎంఐఎం అభ్యర్థులను నిలబెట్టడం ద్వారా అసదుద్దీన్.. బిజెపికి బీ టీమ్‌గా ఎంఐఎంను తయారు చేశారని షబ్బీర్ అలీ అంటున్నారు. ఎంఐఎం వల్ల ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు 22 సీట్లలో ఓడిపోయాయని ఆయనంటున్నారు.

హిందూ పేరుతో ఓట్లు అడిగే బిజెపికి, ముస్లిం అంటూ ఓట్లు అడిగే ఎంఐఎం పార్టీకి పెద్ద తేడా లేదని షబ్బీర్ వ్యాఖ్యానించారు. బీజేపీ ఓట్లు అడిగితే మత తత్వ పార్టీ అంటాము.. ముస్లిం అని చెప్పి ఓట్లు అడుగుతున్న ఎంఐఎం కూడా మతతత్వ పార్టీనే అని ఆయనన్నారు. హైదరాబాద్‌లో పుట్టిన ఎంఐఎం పార్టీ ఏనాడు తెలంగాణలో 44 సీట్లు పోటీ చేయలేదు కానీ.. మహారాష్ట్రలో మాత్రం 44 సీట్లలో పోటీ చేసిందని, ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని హిందువులను తిడుతూ హిందు, ముస్లిం ఓట్లను చీల్చేందుకే అసదుద్దీన్ ప్రయత్నిస్తున్నారని షబ్బీర్ అలీ ఆరోపించారు.