కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

| Edited By: Pardhasaradhi Peri

Sep 02, 2020 | 4:02 PM

కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సివిల్‌ సర్వీసెస్‌ను సమూలంగా ప్రక్షాళన చేయాలన్న ఆలోచనలో కేంద్రం ఉంది.

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
Cabinet Meeting
Follow us on

కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సివిల్‌ సర్వీసెస్‌ను సమూలంగా ప్రక్షాళన చేయాలన్న ఆలోచనలో కేంద్రం ఉంది. ఈ దిశగా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఇక నుంచి ప్రధాని పర్యవేక్షణలో సివిల్‌ సర్వీసెస్‌ పని చేయనుంది.

దేశమంతా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం ఒకే పరీక్ష నిర్వహించడానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దీనికి కర్మ యోగి యోజన అని పేరు పెట్టారు. ఎంపికైన అభ్యర్ధుల అర్హతల ఆధారంగా పోస్టింగ్‌ ఇస్తారు. జమ్ముకశ్మీర్‌ అధికార భాషల బిల్లును కూడా కేబినెట్‌ ఆమోదించింది. అధికార భాషలుగా ఉర్దూ, కశ్మీర్‌, డోగ్రీ, హిందీ, ఇంగ్లీష్‌ భాషలు ఉంటాయి.