Breaking News.. మతపరమైన ప్రార్ధనలకు హాజరైన నలుగురికి కరోనా..!

| Edited By:

Mar 28, 2020 | 5:39 PM

ఓ వైపు అన్ని మతాలకు సంబంధించిన మత పెద్దలు సామూహికంగా ప్రార్ధనలు చేయొద్దని ఎంత చెప్పినా.. కొందరు మాత్రం వారి మాటలను వినడం లేదు. శనివారం ఒక్కరోజే కశ్మీర్‌లో ఏడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శ్రీనగర్‌లో విదేశాలకు వెళ్లి వచ్చిన వారిలో ముగ్గురికి కరోనా పరీక్షలు చేపట్టగా.. వారికి పాజిటివ్ రిపోర్టులు వచ్చాయి. ఇక మతపరమైన ప్రార్ధనలు హాజరైన మరో నలుగురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో పాజిటివ్ వచ్చిన వారు ఎవరెవర్ని కలిశారో […]

Breaking News.. మతపరమైన ప్రార్ధనలకు హాజరైన నలుగురికి కరోనా..!
Follow us on

ఓ వైపు అన్ని మతాలకు సంబంధించిన మత పెద్దలు సామూహికంగా ప్రార్ధనలు చేయొద్దని ఎంత చెప్పినా.. కొందరు మాత్రం వారి మాటలను వినడం లేదు. శనివారం ఒక్కరోజే కశ్మీర్‌లో ఏడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శ్రీనగర్‌లో విదేశాలకు వెళ్లి వచ్చిన వారిలో ముగ్గురికి కరోనా పరీక్షలు చేపట్టగా.. వారికి పాజిటివ్ రిపోర్టులు వచ్చాయి. ఇక మతపరమైన ప్రార్ధనలు హాజరైన మరో నలుగురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో పాజిటివ్ వచ్చిన వారు ఎవరెవర్ని కలిశారో ఆరో తీస్తున్నారు. దీనికి ప్రత్యేక టీంను కేటాయించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే జమ్ముకశ్మీర్‌లో మొత్తం 27 కేసులు నమోదయ్యాయి. వీటిలో 21 కేసులు కశ్మీర్ వ్యాలీలో నమోదవ్వగా.. మిగతా 6 మాత్రం జమ్మూ రీజియన్‌లో నమోదయ్యాయి.

కాగా.. దేశ వ్యాప్తంగా 900 మందికి పైగా పాజిటివ్ కేసులు నమొదవ్వగా.. 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.