“ఆంధ్రా అమ్మాయిగా అలరిస్తా”

రెగ్యూలర్ పాత్రలకు పరిమితం కావడం తనకు నచ్చదని స్పష్టంగా చెప్పేసింది సీరత్‌కపూర్‌. ‘కృష్ణ అండ్‌ హీజ్‌ లీల’ మూవీలో మోడర్ ట్రెండ్ యువతిగా విభిన్నమైన నటనను ప్రదర్శించి ఆకట్టుకుంది‌.

ఆంధ్రా అమ్మాయిగా అలరిస్తా

Updated on: Sep 12, 2020 | 12:19 AM

రెగ్యూలర్ పాత్రలకు పరిమితం కావడం తనకు నచ్చదని స్పష్టంగా చెప్పేసింది సీరత్‌కపూర్‌. ‘కృష్ణ అండ్‌ హీజ్‌ లీల’ మూవీలో మోడర్ ట్రెండ్ యువతిగా విభిన్నమైన నటనను ప్రదర్శించి ఆకట్టుకుంది‌. తదుపరి చిత్రం ‘మా వింత గాథ వినుమా’లో సంప్రదాయాలకు విలువనిచ్చే తెలగమ్మాయిగా కనిపించబోతుంది. ఈ మూవీ గురించి ఇటీవల సీరత్‌కపూర్‌ మాట్లాడుతూ “మా వింత గాథ వినుమా’లో వినిత అనే యువతిగా కనిపిస్తా. క్రమశిక్షణ, జీవితం పట్ల గోల్స్ ఉన్న ఆంధ్రా యువతిగా నా పాత్ర విభిన్నంగా ఉంటుంది. ‘కృష్ణ అండ్‌ హీజ్‌ లీల’ సినిమాలో పోషించిన పాత్రకు ఇది పూర్తి విభిన్నం. ఈ సినిమాలోని నా లుక్‌ను ప్రేక్షకులతో  పంచుకోవడానికి చాలా ఇంట్రస్ట్ తో ఎదురుచూస్తున్నా’ అని తెలిపింది. లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్‌లకు ఆరు నెలలు విరామం తీసుకున్నసీరత్‌కపూర్‌ త్వరలో సెట్స్‌లో అడుగుపెట్టేందుకు రెడీ అవుతోంది.

Also Read :

ఏపీ ప్రజలకు అలెర్ట్ : ఆ ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం