#Covid19 తెలంగాణ సెక్రెటేరియట్‌లో కరోనా… ఉద్యోగికి పాజిటివ్

తెలంగాణ సచివాలయానికి కరోనా వైరస్ సెగ తగిలింది. సచివాలయంలో పని చేస్తున్న ఉద్యోగికి మంగళవారం సాయంత్రం కరోనా పాజిటివ్ తేలింది. దాంతో సచివాలయ ఉద్యోగుల్లో భయాందోళన మొదలైంది.

#Covid19 తెలంగాణ సెక్రెటేరియట్‌లో కరోనా... ఉద్యోగికి పాజిటివ్

Updated on: Mar 31, 2020 | 6:27 PM

Telangana secretariat employee diagnosed Covid positive: తెలంగాణ సచివాలయానికి కరోనా వైరస్ సెగ తగిలింది. సచివాలయంలో పని చేస్తున్న ఉద్యోగికి మంగళవారం సాయంత్రం కరోనా పాజిటివ్ తేలింది. దాంతో సచివాలయ ఉద్యోగుల్లో భయాందోళన మొదలైంది.

సచివాలయంలోని పశు సంవర్ధక శాఖలో పనిచేస్తున్న సెక్షన్ అఫీసర్ ఒకరికి మంగళవారం సాయంత్రం కరోనా పాజిటివ్‌గా గుర్తించారు. సదరు సెక్షన్ అధికారి ఇటీవల ఢిల్లీ వెళ్ళి వచ్చాడని తెలసి పరీక్షలు కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. టెస్టు చేసిన అనంతరం పాజిటివ్‌గా తేలడంతో అతన్ని వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఐసొలేషన్ వార్డులో పెట్టారు.

ప్రస్తుతం తెలంగాణ సచివాలయం ట్యాంక్ బండ్ సమీపంలోని బీఆర్కే భవన్‌లో నిర్వహిస్తున్నందున మొత్తం భవనంలో శానిటైజేషన్ కార్యక్రమాలను యుద్ధప్రాతిపదికన చేపట్టారు. అయితే.. సదరు సెక్షన్ అధికారు ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఎవరెవరిని కలిశారనే అంశంపై ఆరా తీస్తున్నారు. అదే సమయంలో ఆయన కుటుంబీకులకు కరోనా టెస్టులు నిర్వహించేందుకు రంగం సిద్దం చేస్తున్నారు.