పోలవరంపై కేంద్రానికి సుప్రీం షాక్

|

Jan 14, 2020 | 2:19 PM

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మార్పులేమీ వుండబోవన్న కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మంగళవారం షాకిచ్చింది. బచావత్ అవార్డుకు భిన్నంగా ప్రాజెక్టు స్వరూపాన్ని మార్చేశారంటూ ఒడిషా ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. ప్రాజెక్టు స్టేటస్ రిపోర్టుతోపాటు నిర్మాణ చిత్రాలను కోర్టుకు అందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఒడిషా, తెలంగాణ ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్టుపై దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. రెండు రాష్ట్రాలు లేవనెత్తిన అభ్యంతరాలపై రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. బచావత్ […]

పోలవరంపై కేంద్రానికి సుప్రీం షాక్
Follow us on

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మార్పులేమీ వుండబోవన్న కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మంగళవారం షాకిచ్చింది. బచావత్ అవార్డుకు భిన్నంగా ప్రాజెక్టు స్వరూపాన్ని మార్చేశారంటూ ఒడిషా ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. ప్రాజెక్టు స్టేటస్ రిపోర్టుతోపాటు నిర్మాణ చిత్రాలను కోర్టుకు అందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఒడిషా, తెలంగాణ ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్టుపై దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. రెండు రాష్ట్రాలు లేవనెత్తిన అభ్యంతరాలపై రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

బచావత్ అవార్డుకు భిన్నంగా ప్రాజెక్టు స్వరూపాన్ని మార్చారంటూ ఒడిషా ప్రభుత్వం తరపున న్యాయవాది తమ వాదనను వినిపించారు. ప్రాజెక్టు ముంపుపై కనీసం అధ్యయనం కూడా చేయలేదని ఆయన ఆరోపించారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం పోలవరం నిర్మాణంపై తమకెలాంటి అభ్యంతరం లేదని సుప్రీంకోర్టుకు తెలిపింది. అయితే, మణుగూరు ప్లాంటు, గిరిజనులకు ముంపు నష్టం లేకుండా చూడాలని తెలంగాణ ప్రభుత్వం తరపున న్యాయవాది కోర్టుకు నివేదించారు.

అయితే, రెండు రాష్ట్రాల అభ్యంతరాలను తోసిపుచ్చిన కేంద్ర ప్రభుత్వం తరపు న్యాయవాది ప్రాజెక్టు నిర్మాణం యధావిధిగానే కొనసాగుతుందని, ఎలాంటి మార్పులు లేవని తేల్చి చెప్పారు. ఒడిషా, తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలపై సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు పోలవరం నిర్మాణానికి సంబంధించిన సమాచారం రెండు వారాల్లో ఇస్తామని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు నివేదించారు. దాంతో కేసు తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు.