దోశల కింగ్ రాజగోపాల్ ఇకలేరు

| Edited By: Pardhasaradhi Peri

Jul 18, 2019 | 12:26 PM

శరవణ భవన్ ఉద్యోగిని భర్త హత్య కేసులో దోషిగా తేలి యావజ్జీవ శిక్ష పడ్డ శరవణ భవన్ యజమాని పి.రాజగోపాల్ గురువారం గుండెపోటుతో మృతి చెందారు. తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన ఆయనకు బుధవారం వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. అయితే ఆరోగ్య పరిస్థితి అంతకంతకు విషమించడంతో గురువారం గుండెపోటుతో మరణించారు.    ప్రిన్స్ శాంతకుమార్ అనే వ్యక్తి కిడ్నాప్, హత్య కేసులో 2004లో మద్రాస్ హైకోర్టు రాజగోపాల్‌కు 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఆ తర్వాత […]

దోశల కింగ్ రాజగోపాల్ ఇకలేరు
Follow us on

శరవణ భవన్ ఉద్యోగిని భర్త హత్య కేసులో దోషిగా తేలి యావజ్జీవ శిక్ష పడ్డ శరవణ భవన్ యజమాని పి.రాజగోపాల్ గురువారం గుండెపోటుతో మృతి చెందారు. తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన ఆయనకు బుధవారం వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. అయితే ఆరోగ్య పరిస్థితి అంతకంతకు విషమించడంతో గురువారం గుండెపోటుతో మరణించారు.    ప్రిన్స్ శాంతకుమార్ అనే వ్యక్తి కిడ్నాప్, హత్య కేసులో 2004లో మద్రాస్ హైకోర్టు రాజగోపాల్‌కు 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఆ తర్వాత 2009లో దాన్ని యావజ్జీవ శిక్షగా మార్చింది. రాజగోపాల్ దీన్ని సుప్రీంలో సవాల్ చేయగా.. సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పును సమర్థించింది. ఈ నెల జులై 9న ఆయన కోర్టు ఎదుట లొంగిపోయారు. అయితే అనారోగ్య కారణాల రీత్యా ఆయన్ను స్టాన్లీ ఆస్పత్రిలో చేర్పించారు. రాజగోపాల్ కొడుకు పిటిషన్ మేరకు మెరుగైన చికిత్స కోసం స్టాన్లీ ఆస్పత్రి నుంచి విజయ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందారు.

కాగా, దోశల కింగ్‌గా పాపులర్ అయిన రాజగోపాల్ 1981లో చెన్నైలో తొలిసారి శరవణ భవన్‌ను స్థాపించాడు.శరవణ భవన్‌కు వచ్చిన గుర్తింపుతో అనతికాలంలో వ్యాపార సామ్రాజ్యాన్ని విదేశాలకు సైతం విస్తరించాడు. ఇదే క్రమంలో మూడో పెళ్లి చేసుకుంటే మరింత ఎత్తుకు ఎదుగుతావని ఓ జ్యోతిషుడు ఇచ్చిన సలహా మేరకు తన వద్ద పనిచేస్తున్న జ్యోతి అనే వివాహితను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు.అప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్న అతన్ని ఆమె నిరాకరించింది. దీంతో ఆమె భర్త ప్రిన్స్ శాంతకుమార్‌ను కిడ్నాప్ చేయించి హత్య చేయించాడు. పోలీసుల విచారణలో రాజగోపాలే హత్య చేయించినట్టు తేలింది.