మ‌నీల్యాండ‌రింగ్ కేసులో రాబ‌ర్ట్ వాద్రాకు ముంద‌స్తు బెయిల్‌

| Edited By: Anil kumar poka

Apr 02, 2019 | 2:01 PM

న్యూ ఢిల్లీ : మ‌నీల్యాండ‌రింగ్ కేసులో రాబ‌ర్ట్ వాద్రాకు తాత్కాలిక ఉపశమనం కలిగింది. స్పెషల్ సీబీఐ కోర్టు ముంద‌స్తు బెయిల్ మంజూర్‌ చేసింది. వాద్రా స‌న్నిహితుడు మ‌నోజ్ అరోరాకు కూడా కోర్టు బెయిల్‌ను మంజూర్‌ చేసింది. ప్ర‌స్తుతం ఈ కేసులో ఇద్ద‌రూ మ‌ధ్యంత‌ర బెయిల్‌పై ఉన్నారు. కాగా.. ముంద‌స్తు బెయిల్ కోసం ఇద్ద‌రూ రూ. 5 ల‌క్ష‌ల  వ్యక్తిగత పూచికత్తును స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. అయితే అనుమ‌తి లేకుండా వాద్రా దేశం విడిచి వెళ్ల‌రాదని కోర్టు స్ప‌ష్టం చేసింది. […]

మ‌నీల్యాండ‌రింగ్ కేసులో రాబ‌ర్ట్ వాద్రాకు ముంద‌స్తు బెయిల్‌
Follow us on

న్యూ ఢిల్లీ : మ‌నీల్యాండ‌రింగ్ కేసులో రాబ‌ర్ట్ వాద్రాకు తాత్కాలిక ఉపశమనం కలిగింది. స్పెషల్ సీబీఐ కోర్టు ముంద‌స్తు బెయిల్ మంజూర్‌ చేసింది. వాద్రా స‌న్నిహితుడు మ‌నోజ్ అరోరాకు కూడా కోర్టు బెయిల్‌ను మంజూర్‌ చేసింది. ప్ర‌స్తుతం ఈ కేసులో ఇద్ద‌రూ మ‌ధ్యంత‌ర బెయిల్‌పై ఉన్నారు. కాగా.. ముంద‌స్తు బెయిల్ కోసం ఇద్ద‌రూ రూ. 5 ల‌క్ష‌ల  వ్యక్తిగత పూచికత్తును స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. అయితే అనుమ‌తి లేకుండా వాద్రా దేశం విడిచి వెళ్ల‌రాదని కోర్టు స్ప‌ష్టం చేసింది. మరోవైపు ట్ర‌య‌ల్ కోర్టు ఇచ్చిన ఆదేశాల‌ను ఈడీ స‌వాల్ చేయ‌నున్న‌ది.