
రంగారెడ్డి జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాజేంద్రనగర్ లోని హైదర్ గూడా పిల్లర్ నెంబర్ 145 వద్ద ఓ వ్యక్తి కారులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆ వ్యక్తి కారులో మద్యం తాగి పడి ఉండడాన్ని గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకొని, పరిశీలించిన పోలీసులు ఆ వ్యక్తి మృతి చెందినట్టు గుర్తించారు. కారులో మద్యం బాటిళ్లు ఉన్నట్లు గుర్తించారు. మృతుని పేరు దీపక్, ఆ కారు రిజిస్ట్రేషన్ నంబర్ కర్ణాటకకు చెందినదిగా ఉంది. పోలీసులు అతని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.