కృష్ణా జిల్లాలో(జూన్ 17) బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జగ్గయ్యపేట మండలం వేదాద్రి వద్ద ట్రాక్టర్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడిక్కడే మృతి చెందారు. తీవ్రగాయాలతో ఉన్నవారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి చేరుకున్న క్షతగాత్రులకు చికిత్స అందిస్తుండగా మరో ఐదుగురు కూడా చనిపోయారు.
మృతులను మధిర మండలం తొండగ గోపవరం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ గ్రామం నుంచి దాదాపు 25 మంది ట్రాక్టర్‌లో వేదాద్రి దైవదర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. జగ్గయ్యపేట శివారులో వేగంగా ఎదురుగా వచ్చిన లారీ ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
చనిపోయినవారి వివరాలు ఇలా ఉన్నాయి…: