
Eight persons died in a road accident in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నాగులుప్పలపాడు మండలం మాచవరం – రాపర్ల సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘోర ప్రమాదంలో మిర్చి కూలీలతో వెళుతున్న ట్రాక్టర్ విద్యుత్ స్థంభానికి ఢీకొంది. దాంతో విద్యుత్ తీగలు తగిలి 8 మంది కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి స్వల్ప గాయాలు కాగా వారిని ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగినపుడు ట్రాక్టర్‌లో 30 మంది ప్రయాణం చేస్తున్నట్లు సమాచారం.