Revanth Reddy: ఏసీబీ కోర్టులో రేవంత్ ‌రెడ్డి.. కేసేంటంటే?

|

Mar 03, 2020 | 12:07 PM

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మంగళవారం ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. భూముల బాగోతంలో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న రేవంత్ రెడ్డి ఉన్నట్లుండి ఏసీబీ కోర్టుకు రావడంతో రాజకీయ వర్గాల్లో మరోసారి పెద్ద చర్చకు తెరలేచింది

Revanth Reddy: ఏసీబీ కోర్టులో రేవంత్ ‌రెడ్డి.. కేసేంటంటే?
Follow us on

Revanth Reddy presented in ACB court today: తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మంగళవారం ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. భూముల బాగోతంలో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న రేవంత్ రెడ్డి ఉన్నట్లుండి ఏసీబీ కోర్టుకు రావడంతో రాజకీయ వర్గాల్లో మరోసారి పెద్ద చర్చకు తెరలేచింది. రేవంత్ రెడ్డి కోర్టుకు రావడం వెనుక అసలు మ్యాటర్‌ను తెలుసుకునేందుకు, దాని లోతుపాతులను బయటికి లాగేందుకు రాజకీయ నేతలు మీడియా హౌజ్‌లకు ఫోన్ కాల్స్ చేయడం మొదలు పెట్టారు.

ప్రస్తుతం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వున్న రేవంత్ రెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీలో వుండేవారన్న సంగతి అందరికీ తెలిసిందే. తెలుగుదేశం పార్టీలో వున్నప్పుడు చంద్రబాబు ఆదేశాల మేరకు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు భారీ స్థాయిలో లంచం ఇవ్వచూపి, రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీకి పట్టుబడిన సంగతి అప్పట్లో పెను సంచలనం. తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో ఇక నూకలు లేకుండా చేసిన ఉదంతమది. ఆ తర్వాతనే తెలుగుదేశం పార్టీ అధినేత తెలంగాణపై నామమాత్రంగా దృష్టి సారిస్తూ.. ఏపీపైనే పూర్తి స్థాయిలో ఫోకస్‌ చేయడం మొదలైంది.

అంతగా తెలుగు రాష్ట్రాలను ప్రభావితం చేసిన ఓటుకు నోటు కేసులో ఏ1 (ముద్దాయి నెంబర్ 1)గా వున్న రేవంత్ రెడ్డి… మంగళవారం అదే కేసులో ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. 2015 సంవత్సరంలో ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్టు చేయగా.. ఆయన చాన్నాళ్ళు జైలు జీవితం గడిపారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌కు 50 లక్షల రూపాయలు ఇస్తూ రెడ్ హ్యండెడ్ గా ఏసీబీకి దొరికిన రేవంత్ రెడ్డిపై పలు అభియోగాలతో ఛార్జీ షీటు దాఖలు చేశారు. ఈ కేసులో ఏ-1గా రేవంత్ రెడ్డితో పాటు పలువురిపై ఏసీబీ కేసు నమోదు చేసింది.

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ఈ కేసులో అభియోగాలను ఎదుర్కొంటున్నారు.  ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో చంద్రబాబు మినహా పలువురు మంగళవారం ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. తదుపరి విచారణను కోర్టు మార్చి 17వ తేదీకి వాయిదా వేసింది.