రెండేళ్లలో బంగారం రూ.68 వేలు దాటుతుందట..!

బంగారం కొని పెట్టుకున్నవారికి ధర తగ్గుతుందన్న బెంగే ఉండదు ఇప్పుడున్న ట్రెండ్‌ను బట్టి చేస్తే వచ్చే రెండేళ్లలో తులం బంగారం 68 వేల రూపాయలు అయినా ఆశ్చర్యపోనక్కర్లేదట.

రెండేళ్లలో బంగారం రూ.68 వేలు దాటుతుందట..!
Follow us
Balu

|

Updated on: Jun 25, 2020 | 4:05 PM

ఎన్నైనా చెప్పండి.. బంగారం బంగారమే! కొని పెట్టుకున్నవారికి ధర తగ్గుతుందన్న బెంగే ఉండదు.. కొని పెట్టుకోవాలనుకుంటున్నవారికి బంగారం కంటే వేరే ఆప్షనే లేదు.. పసిడికున్న విలువ అలాంటిది… కరోనా వైరస్‌ ఆర్ధిక వ్యవస్థను కకావికలం చేస్తున్న ఈ సంక్షోభ సమయంలో కూడా ఇన్వెస్టర్లకు కాసింత ఆదాయాన్ని ..భరోసాను ఇచ్చే సాధనం బంగారం మాత్రమేనంటున్నారు బులియన్‌ ఎక్స్‌పర్టులు.. ఇప్పటికే పది 50 వేల మార్కుకు చేరుకోవడానికి ఉరుకులు పరుగులు పెడుతున్న బంగారం రాబోయే రోజుల్లో మరింత దూకుడు పెంచవచ్చని అంటున్నారు.. బంగారానికి డిమాండ్‌ పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. భారత ఆర్ధికవృద్ధి అవుట్‌లుక్‌ను ఐఎంఎఫ్‌ తగ్గించడం ఓ కారణమైతే, చైనాతో ప్రస్తుతం నెలకొన్న సరిహద్దు వివాదాలు మరో కారణమని చెబుతున్నారు.. వీటితో పాటు కరోనా కేసులు కూడా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ర్యాలీ చేయడానికి దోహదపడుతున్నాయని విశ్లేషిస్తున్నారు. ఇప్పుడున్న ట్రెండ్‌ను బట్టి చేస్తే వచ్చే రెండేళ్లలో తులం బంగారం 68 వేల రూపాయలు అయినా ఆశ్చర్యపోనక్కర్లేదని బల్లగుద్ది చెబుతున్నారు. ఇలాగే జరిగితే మరో పదేళ్లలో లక్షణంగా లక్షరూపాయలు కావచ్చేమో!