రవళి ఆరోగ్య పరిస్థితి మరింత విషమం.. ఆందోళనలో కుటుంబ సభ్యులు

హైదరాబాద్: ఉన్మాది పెట్రోల్ దాడిలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందున్న రవళి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గత నెల 27న హన్మకొండలోని నయీంనగర్‌లోని వాగ్దేవీ డిగ్రీ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్న తోపుచర్ల రవళిపై అదే కళాశాలకు చెందిన పెండ్యాల సాయి అన్వేష్ పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. తీవ్రంగా గాయపడిన రవళిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించగా గత మూడు రోజులుగా వైద్యులు చికిత్స అందజేస్తున్నారు. […]

రవళి ఆరోగ్య పరిస్థితి మరింత విషమం.. ఆందోళనలో కుటుంబ సభ్యులు

Edited By:

Updated on: Mar 06, 2019 | 10:58 AM

హైదరాబాద్: ఉన్మాది పెట్రోల్ దాడిలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందున్న రవళి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గత నెల 27న హన్మకొండలోని నయీంనగర్‌లోని వాగ్దేవీ డిగ్రీ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్న తోపుచర్ల రవళిపై అదే కళాశాలకు చెందిన పెండ్యాల సాయి అన్వేష్ పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. తీవ్రంగా గాయపడిన రవళిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించగా గత మూడు రోజులుగా వైద్యులు చికిత్స అందజేస్తున్నారు.

70 శాతానికి పైగా శరీరం కాలిపోవడంతో రవళి పరిస్థితి విషమంగా మారుతున్నదని వైద్యవర్గాలు వెల్లడించాయి. శ్వాస కోశ నాలాలు పూర్తిగా కాలిపోవడంతో కృత్రిమంగా శ్వాస అందిస్తున్నట్లు తెలిపారు. రెండు కళ్లు కూడా దెబ్బతినడంతో చూపురావడం కష్టమేనని వైద్యులు చెప్పినట్లు తెలిసింది. దీంతో రవళి పరిస్థితిపై తల్లిదండ్రులు సుధాకర్‌రావు, పద్మలతో పాటుగా ఇతర కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.