ఈశాన్య బంగాళాఖాతంలో సెప్టెంబర్ 2వ తేదీ నుంచి అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. ఈనెల 31, సెప్టెంబర్1,2 తేదీల్లో ఏపీలోని కోస్తాలో ఒకటిరెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిస్తాయని అధికారులు తెలిపారు.
పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశాలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఏర్పడిన వాయువ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో కొనసాగుతుంది. ఇది ఏపీపై అంతగా ప్రభావం చూపదని వాతావరణ అధికారులు తెలిపారు.