బ్రేకింగ్ న్యూస్. లాయర్ ప్రశాంత్ భూషణ్ కు ‘సుప్రీం’ 1 రూపాయి ఫైన్

| Edited By: Anil kumar poka

Aug 31, 2020 | 1:19 PM

కోర్టు ధిక్కరణ కేసులో ప్రముఖ లాయర్ ప్రశాంత్ భూషణ్ కి సుప్రీంకోర్టు ఒక రూపాయి జరిమానా విధించింది. దీన్ని సెప్టెంబరు 15 కల్లా చెల్లించాలని, లేని పక్షంలో మూడు నెలల జైలు శిక్ష, లేదా మూడేళ్లు ఆయన లాయర్ గా పని చేయరాదని తీర్పునిచ్చింది.

బ్రేకింగ్ న్యూస్. లాయర్ ప్రశాంత్ భూషణ్ కు సుప్రీం 1 రూపాయి ఫైన్
Follow us on

కోర్టు ధిక్కరణ కేసులో ప్రముఖ లాయర్ ప్రశాంత్ భూషణ్ కి సుప్రీంకోర్టు ఒక రూపాయి జరిమానా విధించింది. దీన్ని సెప్టెంబరు 15 కల్లా చెల్లించాలని, లేని పక్షంలో మూడు నెలల జైలు శిక్ష, లేదా మూడేళ్లు ఆయన లాయర్ గా పని చేయరాదని తీర్పునిచ్చింది. ఈ కేసులో తాను కోర్టు విధించే ఏ శిక్షకైనా సిధ్ధమేనని ప్రశాంత్ భూషణ్ ఇదివరకే చెప్పారు. కోర్టుకు తను క్షమాపణ చెప్పే ప్రసక్తి లేదన్నారు.

ప్రశాంత్ భూషణ్ కి కోర్టు ఈ ‘శిక్ష’ను విధిస్తూ..భావ ప్రకటనా స్వేఛ్చను ఎవరూ అణచివేయజాలరని వ్యాఖ్యానించింది. అదే సమయంలో తమకు, (కోర్టుకు), ఆయనకు అటార్నీ జనరల్ కేకే. వేణుగోపాల్ ఇచ్చిన సహేతుక సలహాను ప్రస్తావించింది. తను చేసిన పనికి క్షమాపణ చెప్పేందుకు ప్రశాంత్  భూషణ్ కి తాము ఎన్నో అవకాశాలు ఇచ్చామని న్యాయమూర్తులు అన్నారు. కాగా-ఈ లాయర్ కి చిన్న హెచ్చరిక చేసి వదిలేస్తే చాలునని, ఆయన చేసిన ట్వీట్లు న్యాయవ్యవస్థ మెరుగుదలను మాత్రమే కోరాయని  కేకే. వేణుగోపాల్ పేర్కొన్నారు. ఈ కేసులో ప్రజాస్వామ్యాన్ని పాటిద్దాం..ఆయన తన భావ ప్రకటనా స్వేచ్ఛను వినియోగించుకున్నారు..కోర్టు ఇక్కడితో దీన్ని వదిలేస్తే మంచిది అని సలహా ఇఛ్చారు. ఇందుకు కోర్టు కూడా అంగీకరించినట్టు కనిపిస్తోంది.