యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది ప్రభాస్‌కు 20వ సినిమా. ఈ చిత్రానికి ఓ డియర్ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. రొమాంటిక్ డ్రామాగా, పాన్ ఇండియా మూవీగా ఈ భారీ చిత్రం తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఫస్ట్ లుక్ ఎప్పుడు వస్తుందా అని ఆత్రుతగా ఉన్నారు. డార్లింగ్ ప్రభాస్ కొత్త సినిమా ఫస్ట్‌లుక్ విడుదల తేదీ ఫిక్స్ అయింది. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ జులై 10న ఉదయం 10 గంటలకు సోషల్ మీడియా వేదికగా పంచుకోనున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించాడు ప్రభాస్. దీనితో పాటు ఓ ఆసక్తికరమైన ఫొటోను కూడా పోస్ట్ చేశాడు. ఇక ఈ సినిమా 1920ల నాటి కథతో యూరప్ నేపథ్యంగా తెరెక్కిస్తున్నారు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికీ కొంతమేర చిత్రీకరణ జరుపుకుంది. అయితే లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. కాగా వచ్చే ఏడాది వేసవి కానుకగా ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.
The announcement you all have been waiting for! Title & first look of #Prabhas20 will be out on 10.7.2020 at 10 AM?#Prabhas @hegdepooja @director_radhaa @UVKrishnamRaju garu @itsBhushanKumar #Vamshi #Pramod @PraseedhaU @UV_Creations @TSeries pic.twitter.com/64e4maW9us
— UV Creations (@UV_Creations) July 8, 2020