మహాబలిపురంలో ‘స్వచ్ఛ భారత్’.. ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరిన మోదీ

| Edited By: Pardhasaradhi Peri

Oct 12, 2019 | 1:22 PM

యోగా, స్వచ్ఛ భారత్‌కు బ్రాండ్ అంబాసిడర్ అయిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఆ విలక్షణతను మరోసారి చాటుకున్నారు. ఈ ఉదయం యోగా పూర్తి చేసుకుని.. ఆ వెంటనే మహాబలిపురంలోని బీచ్‌ని క్లీన్ చేశారు మోదీ. సముద్ర తీరంలో పడివున్న చెత్తను, ప్లాస్టిక్‌ను ఏరి చెత్తబుట్టలో వేశారు. ఆ చెత్తబుట్టను తీసుకెళ్లి హోటల్ స్టాఫ్ జయరాంకి తీసుకెళ్లి ఇచ్చారు. చెత్త ఏరడానికి అరగంట పట్టిందంటూ.. మోదీ తన ట్విట్టర్‌లో ట్వీట్ చేసి.. ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ‘మల్లాపురం బీచ్‌కు […]

మహాబలిపురంలో స్వచ్ఛ భారత్.. ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరిన మోదీ
Follow us on

యోగా, స్వచ్ఛ భారత్‌కు బ్రాండ్ అంబాసిడర్ అయిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఆ విలక్షణతను మరోసారి చాటుకున్నారు. ఈ ఉదయం యోగా పూర్తి చేసుకుని.. ఆ వెంటనే మహాబలిపురంలోని బీచ్‌ని క్లీన్ చేశారు మోదీ. సముద్ర తీరంలో పడివున్న చెత్తను, ప్లాస్టిక్‌ను ఏరి చెత్తబుట్టలో వేశారు. ఆ చెత్తబుట్టను తీసుకెళ్లి హోటల్ స్టాఫ్ జయరాంకి తీసుకెళ్లి ఇచ్చారు. చెత్త ఏరడానికి అరగంట పట్టిందంటూ.. మోదీ తన ట్విట్టర్‌లో ట్వీట్ చేసి.. ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ‘మల్లాపురం బీచ్‌కు జాగింగ్‌ వెళ్లిన సమయంలో అక్కడ చెత్తను తొలగించాను. బహిరంగ ప్రదేశాలను స్వచ్ఛంగా.. శుభ్రంగా ఉంచుదాం.. మనమంతా ఫిట్‌గా.. ఆరోగ్యంగా ఉండేలా చూసుకుందాం’ అని మోదీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఒక దేశానికి ప్రధాని మంత్రి అయి ఉండి.. ఆయన బీచ్‌ని క్లీన్ చేయడంతో.. స్థానికంగా ఉన్నవారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.