ఏపీలో మళ్ళీ ప్రజాభిప్రాయ సేకరణ… ఈసారి టాపిక్ ఇదే!

|

Oct 19, 2020 | 4:05 PM

ఏపీలో మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ జరగబోతోంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా సోమవారం జరిగిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ భేటీలో వెల్లడించారు. ముందుగా...

ఏపీలో మళ్ళీ ప్రజాభిప్రాయ సేకరణ... ఈసారి టాపిక్ ఇదే!
Follow us on

Plebisite in Andhra Pradesh: ఏపీలో మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ జరగబోతోంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా సోమవారం జరిగిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ భేటీలో వెల్లడించారు. ముందుగా ముసాయిదా విధానాన్ని తయారు చేసి.. దాని మీద ప్రజాభిప్రాయాన్ని సేకరించిన మీదటనే విధానాన్ని ఖరారు చేసి, ప్రకటించాలని ముఖ్యమంత్రి సోమవారం నాటి సమావేశంలో ఖరాఖండీగా చెప్పారు.

రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్ని నాని, కొడాలి నాని తదితరులు ప్రాతినిధ్యం వహిస్తున్న గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్‌తోను, పంచాయితీరాజ్ ఉన్నతాధికారులతోను ముఖ్యమంత్రి సోమవారం సమావేశమయ్యారు. నూతన ఇసుక విధానంపై ఆయన సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కీలకమైన కామెంట్స్ చేశారు.

‘‘ ఇసుక తవ్వకాలు, సరఫరాలో ఎక్కడా అవినీతికి తావు ఉండొద్దు.. పూర్తి పారదర్శకంగా విధానం ఉండాలి.. ధర కూడా రీజనబుల్‌గా ఉండాలి.. అలాగే ఇసుక సరఫరాలో ఎఫీషియన్సీ పెంచాలి.. నాణ్యమైన ఇసుకనే సరఫరా చేయాలి.. పూర్తి నాణ్యతా ప్రమాణాలు పాటించాలి.. ఇసుక రీచ్‌లు, సామర్థ్యం పెంచితే పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయి.. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ కూడా వచ్చే అవకాశం వుంది.. ఇసుక రవాణా వ్యయం ఎక్కువగా ఉంది.. అది రీజనబుల్‌గా ఉండాలి.. చలాన్‌ కట్టి ఎవరైనా వచ్చి ఇసుక తీసుకుపోయే విధంగా కొత్త విధానం ఉండాలి.. ఏ రేటుకు అమ్మాలి? అన్నది నియోజకవర్గాలు లేదా ప్రాంతాల వారీగా నిర్ధారణ జరగాలి.. అంతకన్నా ఎక్కువ రేటుకు అమ్మితే ఎస్‌ఈబీ రంగ ప్రవేశం చేస్తుంది.. ఎవరికి వారు రీచ్‌కు వచ్చి కావాల్సిన ఇసుక తీసుకుపోవడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన సదుపాయాలు కల్పించాలి… ’’ అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.

టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్‌ స్టాండ్‌బై రవాణా సదుపాయం కూడా కల్పించాలేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆ నియోజకవర్గంలో నిర్దేశించిన ధర కంటే ఎక్కువకు అస్సలు అమ్మడానకి వీల్లేదని ఖరాఖండీగా చెప్పిన సీఎం.. ప్రభుత్వ నిర్మాణాలు, బలహీన వర్గాల ఇళ్లకు సబ్సిడీపై ఇసుక సరఫరా చేయాలని, అందుకు టోకెన్లు ఇచ్చి ఇసుక సరఫరా చేయించాలని ఆయన చెప్పారు. స్థానికంగా ఉన్న వారికి ఇసుక అవసరమైతే, వారికి కూపన్లు ఇచ్చి, వాటిపై సబ్సిడీ ధరకు ఇసుక సరఫరా చేయొచ్చని, నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న గ్రామాలకు ఎన్ని కిలోమీటర్ల పరిధి వరకు సబ్సిడీ ధరపై ఇసుక సరఫరా చేయవచ్చనే విషయాన్ని పరిశీలించాలని జగన్ ఆదేశించారు. ఈ అంశాలతో కూడిన కొత్త ఇసుక విధానం ముసాయిదాను రూపొందించిన అనంతరం.. దానిపై ప్రజాభిప్రాయ సేకరణ చేసిన తర్వాతనే విధానాన్ని ఖరారు చేయాలని మంత్రుల బృందానికి సూచించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.

Also read: బహిరంగచర్చకు రెడీ.. బండికి హరీశ్ సవాల్

Also read: కిస్తులు కట్టిన వారికి త్వరలో మోదీ సర్కార్ శుభవార్త!

Also read: మళ్ళీ వర్షగండం… భయపడొద్దన్న కేటీఆర్

Also read: త్వరలో తెలంగాణకు కేంద్ర బ‌ృందం.. వెల్లడించిన కిషన్‌రెడ్డి