లాక్‌డౌన్‌ ఉల్లంఘిస్తే అంతే సంగతులు.. పూణె పోలీసుల శిక్షలు చూస్తే షాక్ తినాల్సిందే..!

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే. కేవలం అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావొద్దంటూ హెచ్చరికలు చేస్తున్నాయి ప్రభుత్వాలు. అయితే కొందరు చిన్న చిన్న రీజన్స్‌ చెప్తూ.. లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఇలాంటి వారిని చూస్తూ విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ఏం చేయాలో అర్ధం కావడం లేదు. కేసులు బుక్‌ చేసినా.. లాఠీ చార్జ్‌ చేస్తున్నా.. కొందరు మాత్రం.. ఏదో ఓ రీజన్‌ చెప్తూ రోడ్లపైకి వస్తున్నారు. అయితే ఇలా లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన […]

లాక్‌డౌన్‌ ఉల్లంఘిస్తే అంతే సంగతులు.. పూణె పోలీసుల శిక్షలు చూస్తే షాక్ తినాల్సిందే..!

Edited By:

Updated on: Apr 16, 2020 | 7:35 PM

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే. కేవలం అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావొద్దంటూ హెచ్చరికలు చేస్తున్నాయి ప్రభుత్వాలు. అయితే కొందరు చిన్న చిన్న రీజన్స్‌ చెప్తూ.. లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఇలాంటి వారిని చూస్తూ విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ఏం చేయాలో అర్ధం కావడం లేదు. కేసులు బుక్‌ చేసినా.. లాఠీ చార్జ్‌ చేస్తున్నా.. కొందరు మాత్రం.. ఏదో ఓ రీజన్‌ చెప్తూ రోడ్లపైకి వస్తున్నారు. అయితే ఇలా లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి బుద్ధి చెప్పేందుకు పూణె పోలీసులు సరికొత్త శిక్షలు విధిస్తున్నారు.

లాక్‌డౌన్‌ను ఉల్లంఘించి రోడ్లపైకి వస్తున్న వారికి.. కరోనాపై అవగాహన కల్పించేందుకు కరోనా వైరస్‌లా, యమధర్మరాజులా పోలీసులు వేషాలు ధరిస్తున్నారు. నిబంధనలను ఎవరు ఉల్లంఘించినా.. సహించేది లేదంటూ పోలీసులు స్పష్టం చేస్తున్నారు.అయితే ఈ క్రమంలో పూణెలోని బిబ్వెవాడీ ప్రాంతంలో లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘిస్తూ.. కొందరు వ్యక్తులు మార్నింగ్‌ వాక్‌ పేరుతో బయటకు వచ్చారు.

అయితే ఇలా వచ్చిన వారందర్నీ పోలీసులు అడ్డుకున్నారు. వీరందరికీ వెరైటీ శిక్షలు వేశారు. ఎలాగూ.. వాకింగ్ అని బయటికి వచ్చారనుకున్నారో ఏమో.. అలా రీజన్‌ లేకుండా వచ్చిన వారందరితో.. రోడ్డుపైనే సూర్యనమస్కారాలు వేయించారు. అంతేకాదు..యోగా కూడా చేయించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.