తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఎక్కడికి వచ్చినా ఆయన్ను చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడిపోతుంటారు. వారి వీరాభిమానంతో పలుమార్లు ఆయన కిందపడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా జనసేనాని అమరావతి పర్యటనకొచ్చిన సందర్భంగా ఓ సంఘటన జరిగింది.
రాజధాని మారుతుందన్న వార్తల నేపథ్యంలో ఆందోళనకు గురైన రైతులకు మద్దతుగా నిలిచారు జనసేనాని. ఇందులో భాగంగా అమరావతిలో పర్యటించేందుకు మంగళగిరి పాత బస్టాండ్‌కు చేరుకున్నారు. ఆయనకు జనసైనికులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఓ అభిమాని తాను తయారుచేసిన చెప్పులను పవన్‌కు గిఫ్ట్ గా ఇచ్చాడు. తాను ఇచ్చిన చెప్పులతోనే అమరావతిలో పర్యటించాలని కోరాడు. నవ్వుతూ ఆ చెప్పులు తీసుకున్న పవన్..అక్కడి నుంచి అమరావతికి వెళ్లారు.