ఐఏఎఫ్‌ దాడుల్లో మా చెట్లు కూలిపోయాయి.. భారత్‌పై ఫిర్యాదు చేస్తామంటున్న పాక్

| Edited By:

Mar 02, 2019 | 8:23 AM

ఇస్లామాబాద్‌: భారత్‌ వైమానిక దళం మిరాజ్ విమానాలతో వేసిన బాంబుల వల్ల పాక్‌ అడవిలో ఉన్న చెట్లు కూలిపోయాయని దీంతో పర్యావరణానికి తీవ్ర నష్టం జరిగిందని పాకిస్థాన్‌ మంత్రి మాలిక్‌ అమిన్‌ అస్లాం ఆరోపించారు. బాలాకోట్‌లో ఇటీవల భారత వైమానిక దళం(ఐఏఎఫ్‌) జరిపిన వైమానిక దాడుల వల్ల అటవీ సంరక్షణభూమిలో డజన్లకొద్దీ దేవదారు వృక్షాలు కుప్పకూలాయని ఆరోపించారు. అంతే కాకుండా పెద్ద గుంతలు ఎర్పడ్డాయని ఆరోపించారు. ఈ ఘటనపై ఐక్యరాజ్యసమితిలో భారత్‌పై ఫిర్యాదు కూడా చేస్తామని ఆయన […]

ఐఏఎఫ్‌ దాడుల్లో మా చెట్లు కూలిపోయాయి.. భారత్‌పై ఫిర్యాదు చేస్తామంటున్న పాక్
Follow us on

ఇస్లామాబాద్‌: భారత్‌ వైమానిక దళం మిరాజ్ విమానాలతో వేసిన బాంబుల వల్ల పాక్‌ అడవిలో ఉన్న చెట్లు కూలిపోయాయని దీంతో పర్యావరణానికి తీవ్ర నష్టం జరిగిందని పాకిస్థాన్‌ మంత్రి మాలిక్‌ అమిన్‌ అస్లాం ఆరోపించారు. బాలాకోట్‌లో ఇటీవల భారత వైమానిక దళం(ఐఏఎఫ్‌) జరిపిన వైమానిక దాడుల వల్ల అటవీ సంరక్షణభూమిలో డజన్లకొద్దీ దేవదారు వృక్షాలు కుప్పకూలాయని ఆరోపించారు. అంతే కాకుండా పెద్ద గుంతలు ఎర్పడ్డాయని ఆరోపించారు. ఈ ఘటనపై ఐక్యరాజ్యసమితిలో భారత్‌పై ఫిర్యాదు కూడా చేస్తామని ఆయన తెలిపారు. భారత్ దాడి చేసినట్లుగా చెబుతున్న ఆ ప్రాంతాలను పరిశీలించాలంటూ అంతర్జాతీయ మీడియా ప్రతినిధులను పాక్ ఆహ్వానించింది. దీంతో ఇద్దరు రాయిటర్స్‌ రిపోర్టర్లు ఆ ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ కొన్ని పెద్ద గుంతలు ఉన్నట్లు గుర్తించారట.. ఇంకా అక్కడ 15 దేవదారు చెట్లు కూలిపోయినట్లు కూడా ఆ పాత్రికేయులకు కనిపించాయట. దీంతో భారత్‌ బాంబులు వేయడం వల్ల తమ అటవీ ప్రాంతం దెబ్బతిందని మంత్రి అస్లాం అంటున్నారు.