
న్యూఢిల్లీ: పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలట. పాకిస్తానీలు ఈ మేరకు సోషల్ డిమాండ్ చేస్తున్నారు. భారత్‌తో ఉన్న ఉద్రిక్త పరిస్థితులను చక్కదిద్దినందున ఇమ్రాన్‌కు నోబెల్ శాంతి ఇవ్వాలని ఆ దేశ ప్రజలు సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు పెడుతున్నారు.
ఈ డిమాండ్ ఇప్పుడు అక్కడి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. భారత ఫైటర్ పైలట్ అభినందన్‌ను శాంతి నెలకొల్పానే ఉద్దేశంతో భారత్‌కు అప్పగించాలని నిర్ణయించినట్టు ఇమ్రాన్ ఖాన్ పాక్ పార్లమెంట్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే.