#COVID19 ఐటి కట్టక్కర్లేదు.. ఆధార్, పాన్ లింక్ లేదు.. కరోనా రిలీఫ్ ఇదే

| Edited By: Pardhasaradhi Peri

Mar 24, 2020 | 3:25 PM

కరోనా ప్రభావంతో కునారిల్లిపోతున్న ప్రజలకు ఊరటనిచ్చే చర్యలకు శ్రీకారం చుట్టింది మోదీ ప్రభుత్వం. మార్చ్ 31వ తేదీ వరకు ఉన్న పలు గడువులను జూన్ 30వ తేదీకి పొడిగించింది కేంద్రం. ఈ వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ మంగళవారం న్యూ ఢిల్లీ లో వెల్లడించారు.

#COVID19 ఐటి కట్టక్కర్లేదు.. ఆధార్, పాన్ లింక్ లేదు.. కరోనా రిలీఫ్ ఇదే
Follow us on

Corona relief to country men: కరోనా ప్రభావంతో కునారిల్లిపోతున్న ప్రజలకు ఊరటనిచ్చే చర్యలకు శ్రీకారం చుట్టింది మోదీ ప్రభుత్వం. మార్చ్ 31వ తేదీ వరకు ఉన్న పలు గడువులను జూన్ 30వ తేదీకి పొడిగించింది కేంద్రం. ఈ వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ మంగళవారం న్యూ ఢిల్లీ లో వెల్లడించారు. దీంతో వేతన జీవులతో పాటు, ప్రైవేట్ వ్యాపార, వాణిజ్య, కార్పొరేట్ సంస్థలకు కూడా ఊరట లభించినట్లయింది.

దేశ ఆర్ధిక వ్యవస్థపై కరోనా వైరస్ ప్రభావం పెద్ద ఎత్తున ఉండే అవకాశాలున్నట్లు నిర్మల సీతారామన్ అభిప్రాయపడ్డారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్ట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆదాయపన్ను చెల్లింపునకు ఉన్న మార్చ్ 31వ తేదీ గడువును.. మూడు నెలలపాటు అంటే జూన్ 30వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ఆర్ధిక మంత్రి ప్రకటించారు. త్వరలో ఉద్దీపన ప్యాకేజీ ప్రకటిస్తామన్న ఇండికేషన్ ఇచ్చారు నిర్మల సీతారామన్. ఆధార్ కార్డుతో పాన్ కార్డును అనుసంధానం చేసేందుకు గడువు తేదీని కూడా మార్చ్ 31వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించారు.

వచ్చే ఆర్ధిక సంవత్సరానికిగాను (2020-21) వివాద్ సే విశ్వాస్ తక్ స్కీం ఎంపిక చేసుకునేందుకు కూడా గడువు పెంచారు. మార్చ్ 31వ తేదీ తర్వాత వివాద్ సే విశ్వాస్ తక్ ఎంపిక చేసుకుంటే 10 శాతం అదనంగా ఆదాయపన్ను చెల్లించాల్సి వచ్చేది ఇపుడు దాన్ని కూడా జూన్ 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు వెల్లడించారు ఆర్ధిక మంత్రి. అయితే దేశంలో ఆర్ధిక అత్యవసర పరిస్థితి ప్రకటించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా క్లారిటీ ఇచ్చారు.