‘రాహుల్ జీ ! డీఫాల్టర్ల నిర్వాకం మీ పార్టీ చలవే !.. నిర్మలా సీతారామన్

| Edited By: Anil kumar poka

Apr 29, 2020 | 11:23 AM

దేశంలోని బ్యాంకులను నిండా ముంచిన 50 మంది డీఫాల్టర్ల జాబితాను రిజర్వ్ బ్యాంకు విడుదల చేసిన నేపథ్యంలో.. అలా రుణాలు ఎగగొట్టిన వారిలో బీజేపీ మిత్రులు ఉన్నారంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణను ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఖండించారు...

రాహుల్ జీ ! డీఫాల్టర్ల నిర్వాకం మీ పార్టీ చలవే !.. నిర్మలా  సీతారామన్
Follow us on

దేశంలోని బ్యాంకులను నిండా ముంచిన 50 మంది డీఫాల్టర్ల జాబితాను రిజర్వ్ బ్యాంకు విడుదల చేసిన నేపథ్యంలో.. అలా రుణాలు ఎగగొట్టిన వారిలో బీజేపీ మిత్రులు ఉన్నారంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణను ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఖండించారు. ఆయన చేసిన ఆరోపణలు ప్రజలను తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయన్నారు. బ్యాంకు రుణాల మాఫీ అంటే మీ పార్టీ నేత, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను సంప్రదించి తెలుసుకోవాలన్నారు. 2009-10, 2013-14 మధ్య షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు 1,45,226 కోట్లను మాఫీ చేశాయన్నారు. రిజర్వ్ బ్యాంకు నిర్దేశించిన నాలుగేళ్ల ప్రొవిజనల్ సైకిల్ ప్రకారం నిరర్థక ఆస్తులకు సంబంధించి కొన్ని నిబంధనలు ఉన్నాయని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. బ్యాంకులు ఎవరి రుణాన్నీ మాఫీ చేయలేదని, రుణాలు చెల్లించే సామర్థ్యం ఉన్నప్పటికీ కావాలనే ఎగగొట్టినవారిని ‘విల్ ఫుల్ డీఫాల్టర్లు’ గా ఆర్ బీ ఐ ఆయా కేటగిరీల్లో చేర్చిందని వివరించారు. నాటి యూపీఏ ‘ఫోన్ బ్యాంకింగ్ ‘ద్వారా లాభపడినవారే డీఫాల్టర్లుగా మారారని నిర్మల తెలిపారు. మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా ఉన్న రఘురామ్ రాజన్ చేసిన వ్యాఖ్యలను ఆమె గుర్తు చేశారు.

2006-2018 మధ్య మొండి రుణాలను ఎక్కువగా ఇచ్చారని ఆమె వెల్లడించారు. అటు-నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ. విజయ్ మాల్యాల విషయాన్ని ప్రస్తావిస్తూ ఆమె మొత్తం 13 ట్వీట్లు చేశారు.