Breaking News Nirbhaya case: మార్చి 3న నిర్భయ దోషులకు ఉరి కన్ఫామ్

| Edited By:

Feb 17, 2020 | 4:44 PM

Breaking News Nirbhaya case: నిర్భయ దోషులకు కొత్త డెత్ వారెంట్ ఇచ్చింది పటియాల కోర్టు. నలుగురు దోషులకు మార్చి 3వ తేదీన ఉదయం 6 గంటలకు ఉరి తీయాలని న్యాయ స్థానం కొత్త ఆదేశాలు జారీ చేసింది. దాదాపు ఏడేళ్లుగా నిర్భయ కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. దోషులకు శిక్ష అమలు విషయంలో వాయిదాల మీద వాయిదాలు పడుతూనే వస్తోంది. అటు దోషులు కూడా తప్పించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తమకు ఉన్న న్యాయపరమైన అవకాశాలన్నింటినీ […]

Breaking News Nirbhaya case: మార్చి 3న నిర్భయ దోషులకు ఉరి కన్ఫామ్
Follow us on

Breaking News Nirbhaya case: నిర్భయ దోషులకు కొత్త డెత్ వారెంట్ ఇచ్చింది పటియాల కోర్టు. నలుగురు దోషులకు మార్చి 3వ తేదీన ఉదయం 6 గంటలకు ఉరి తీయాలని న్యాయ స్థానం కొత్త ఆదేశాలు జారీ చేసింది. దాదాపు ఏడేళ్లుగా నిర్భయ కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. దోషులకు శిక్ష అమలు విషయంలో వాయిదాల మీద వాయిదాలు పడుతూనే వస్తోంది. అటు దోషులు కూడా తప్పించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తమకు ఉన్న న్యాయపరమైన అవకాశాలన్నింటినీ ఉపయోగించుకుంటూ తాత్సారం చేసుకుంటూ వచ్చారు. కాగా.. దోషులకు కొత్త డెత్ వారెంట్ జారీ చేయాలన్న తీహార్ జైలు అధికారుల పిటిషన్లపై న్యాయస్థానం విచారణ జరిపింది.

ఈ సందర్భంగా మార్చి 3వ తేదీన ఉదయం ఆరు గంటలకు.. నలుగురు దోషులకు ఉరిశిక్షను అమలు చేస్తూ ఆదేశాలను జారీ చేసింది. నిర్భయ దోషులకు విడిగా ఉరిశిక్ష అమలు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ పిటిషన్‌పై శుక్రవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. అయితే జడ్జి సొమ్మసిల్లి పడిపోవడంతో తీర్పు వాయిదా పడింది. కాగా అంతకు ముందు దోషి వినయ్ శర్మ పిటిషన్‌ను తిరస్కరించింది సుప్రీం కోర్టు. వినయ్ శర్మ మానసిక ఆరోగ్యం పరిస్థితి బాగానే ఉందని క్షమాభిక్షకు అర్హులు కాదని పేర్కొంది.

అయితే ఈ సందర్భంగా నిర్భయ తల్లి ఆశాదేవి మీడియాతో మాట్లాడారు. ఏడేళ్లుగా న్యాయం కోసం ఎదురు చూస్తున్నామని , తీర్పు తమకే అనుకూలంగా ఉంటుందని ఆవిడ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటివరకూ ముగ్గురు న్యాయ ప్రక్రియ పూర్తి అయిందని, పవన్ ఒక్కడే మిగిలి ఉన్నాడని, అయినా కోర్టుపై తమకు నమ్మకం ఉందని అన్నారు నిర్భయ తల్లి ఆశా దేవి.