బెజవాడ బరిలోకి ఎన్డీఆర్ఎఫ్.. లాక్‌డౌన్‌లో ఇక చుక్కలే

|

Apr 25, 2020 | 1:50 PM

లాక్ డౌన్ నిబంధనలు బేఖాతరు చేస్తూ రోడ్ల మీదికి వస్తున్న ప్రజలను నియంత్రించేందుకు బెజవాడ పోలీసులు ఎన్డిఆర్ఎఫ్ ను ఆశ్రయించారు. అనవసరమైన కారణాలను చూపిస్తూ రోడ్ల మీదికి వస్తున్న వారిపట్ల ఎన్టీఆర్ ఎఫ్ సిబ్బంది మరింత కఠినంగా వ్యవహరించనున్నారు.

బెజవాడ బరిలోకి ఎన్డీఆర్ఎఫ్.. లాక్‌డౌన్‌లో ఇక చుక్కలే
Follow us on

లాక్ డౌన్ నిబంధనలు బేఖాతరు చేస్తూ రోడ్ల మీదికి వస్తున్న ప్రజలను నియంత్రించేందుకు బెజవాడ పోలీసులు ఎన్డిఆర్ఎఫ్ ను ఆశ్రయించారు. అనవసరమైన కారణాలను చూపిస్తూ రోడ్ల మీదికి వస్తున్న వారిపట్ల ఎన్టీఆర్ ఎఫ్ సిబ్బంది మరింత కఠినంగా వ్యవహరించనున్నారు. అనవసరంగా రోడ్ల మీదకు వస్తున్న వారి వాహనాలను సీజ్ చేస్తున్న పోలీసులు, ఆ వాహనాలను లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేసే వరకు తిరిగి ఇచ్చే ప్రసక్తే లేదని కరాఖండిగా చెబుతున్నారు.

ప్రభుత్వం ఇదివరకే ఇచ్చిన వెసులుబాటు లను దుర్వినియోగం చేస్తున్న వారిని ఉపేక్షించేది లేదని డి సి పి హర్షవర్ధన రాజు శనివారం ప్రకటించారు. సరైన కారణాలు లేకుండా రోడ్ల మీదికి వస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే వేలాది వాహనాలను సీజ్ చేశామని సీజ్ చేసిన వాహనాలను లాక్ డౌన్ పీరియడ్ ముగిసేవరకు తిరిగి ఇవ్వమని ఆయన స్పష్టం చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో లాక్ డౌన్ ఆంక్షలను మరింత పక్కాగా పాటించడం తప్ప మరో మార్గం లేదని డిసిపి అంటున్నారు.

ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ ఇళ్ల కే పరిమితం కావాలని డి సి పి బెజవాడ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రాణాపాయం ఉందని తెలిసినా ప్రజల ఆరోగ్యం కోసం వాటి ప్రాణరక్షణ కోసం విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బందికి పోలీసు సిబ్బందికి ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. విపత్కర పరిస్థితులను అధిగమించే వరకు ప్రభుత్వం సూచిస్తున్న నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆయన కోరారు. నిబంధనలను సరిగ్గా పాటించని వారిపట్ల కఠినంగా వ్యవహరించేందుకు బెజవాడలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని రంగంలోకి దిగినట్లు ఆయన ప్రకటించారు.