ఈ రోజు కింగ్ నాగార్జున పుట్టినరోజు. అంటే అక్కినేని అభిమానులకు పండుగ రోజు. దీంతో ఓ స్పెషల్ అనౌన్సిమెంట్ చేశారు నాగ్ పెద్ద కుమారుడు నాగ చైతన్య. ఎన్నాళ్ల నుంచో అనుకుంటోన్న విక్రమ్ కె కుమార్‌తో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు. నాగ్‌కు పుట్టినరోజు విషెస్ తెలుపుతూ టైటిల్ రివీల్ చేశారు. ఈ సినిమాకు ‘థ్యాంక్యూ’ అనే టైటిల్ పెట్టారు. టైటిల్ ప్రకటనలో కూడా విభిన్నతను చాటుకున్నారు. రెండు దశాబ్దాల తమ ప్రయాణంలో కీలకంగా ఉన్నందుకు నాగార్జునకు ‘థాంక్యూ’ అని చెప్పారు దిల్‌రాజు. తనను నమ్మి `మనం` చిత్రాన్ని ఇచ్చినందుకు `థాంక్యూ` చెప్పారు డైరెక్టర్ విక్రమ్. ఇక తన లైఫ్‌లో కింగ్‌గా ఉన్నందుకు ‘థాంక్యూ ‘చెప్పాడు చైతూ.
దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరోయిన్‌తో పాటు ఇతర సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల-నాగచైతన్య కాంబినేషన్లో వస్తోన్న ‘లవ్‌స్టోరీ’ మూవీ తుదిదశకు చేరుకుంది. ఈ సినిమా తర్వాత విక్రమ్‌తో కలిసి పనిచేయనున్నాడు చైతూ.
‘????? ???’. #ThankYouTheMovie @Chay_Akkineni @Vikram_K_Kumar #DilRaju, #Shirish, #HarshithReddy @BVSRavi #NC20 pic.twitter.com/sdLuAlbz8l
— Sri Venkateswara Creations (@SVC_official) August 29, 2020