కోవిడ్‌ను జయించిన 100 ఏళ్ల వృద్ధుడు.. ఆస్పత్రిలోనే బర్త్ డే..

| Edited By:

Jul 15, 2020 | 1:26 PM

ముంబైకి చెందిన రిటైర్డ్ గవర్నమెంట్ స్కూల్ హెడ్‌ మాస్టర్ నారింగ్రేకర్ కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడ్డారు. దగ్గు, జ్వరం, జలుబు వంటి లక్షణాలు కనిపించడంతో ఆయన కరోనా పరీక్షలు చేయించుకోగా.. కోవిడ్ వచ్చినట్లు నిర్థారణ అయింది. జులై 1వ తేదీన ముంబైలోని బాలాసాహెబ్ థాక్రే ట్రామా కేర్ ఆస్పత్రిలో..

కోవిడ్‌ను జయించిన 100 ఏళ్ల వృద్ధుడు.. ఆస్పత్రిలోనే బర్త్ డే..
Follow us on

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతోన్న సంగతి తెలిసిందే. అలాగే కోవిడ్ రికవరీ రేటు కూడా పెరుగుతోంది. ఈ వైరస్ బారిన పడిన వారిలో దాదాపు 63 శాతం మంది కోలుకుంటున్నాని వెల్లడించింది కేంద్రం. తాజాగా ముంబైకి చెందిన ఓ 100 ఏళ్ల వృద్ధుడు కరోనాను జయించాడు. అయితే కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న రోజే 101వ సంవత్సరంలోకి అడుగు పెట్టాడు ఆ వృద్ధుడు. దీంతో ఆస్పత్రిలోనే బర్త్ డే వేడుకలు చేశారు వైద్య సిబ్బంది.

వివరాల్లోకి వెళ్తే.. ముంబైకి చెందిన రిటైర్డ్ గవర్నమెంట్ స్కూల్ హెడ్‌ మాస్టర్ నారింగ్రేకర్ కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడ్డారు. దగ్గు, జ్వరం, జలుబు వంటి లక్షణాలు కనిపించడంతో ఆయన కరోనా పరీక్షలు చేయించుకోగా.. కోవిడ్ వచ్చినట్లు నిర్థారణ అయింది. జులై 1వ తేదీన ముంబైలోని బాలాసాహెబ్ థాక్రే ట్రామా కేర్ ఆస్పత్రిలో చేరారు. 14 రోజుల కరోనా చికిత్స తరువాత నారింగ్రేకర్ పూర్తిగా కోలుకున్నారు. ఇక బుధవారమే ఆయన పుట్టిన రోజు కావడంతో కుటుంబ సభ్యులు, వైద్య సిబ్బంది కలిసి ఆయనకి బర్త్ డే వేడుకలు చేశారు. ఇవాళ రాత్రి ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నారు.

Read More:

హైదరాబాద్‌లో కరోనా జోరు.. హైరిస్క్ ప్రాంతాల్లో కొత్త రూల్స్..

తొమ్మిదిమంది స్టార్ డైరెక్టర్స్‌తో.. వెబ్ సిరీస్‌లోకి హీరో సూర్య..