బెంగుళూరులో హై డ్రామా.. దిగ్విజయ్ సింగ్ ని బలవంతంగా ఈడ్చుకెళ్లి.. వ్యాన్ లో కుదేసి..

| Edited By: Anil kumar poka

Mar 18, 2020 | 12:14 PM

బెంగుళూరులో ఉన్న 22 మంది  రెబెల్  కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కలుసుకునేందుకు బుధవారం ఉదయం భోపాల్ నుంచి వఛ్చిన కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ను పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్ళి, వాహనంలోకి కుక్కి..

బెంగుళూరులో హై  డ్రామా..  దిగ్విజయ్ సింగ్ ని బలవంతంగా ఈడ్చుకెళ్లి.. వ్యాన్ లో కుదేసి..
Follow us on

బెంగుళూరులో ఉన్న 22 మంది  రెబెల్  కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కలుసుకునేందుకు బుధవారం ఉదయం భోపాల్ నుంచి వఛ్చిన కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ను పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్ళి, వాహనంలోకి కుక్కి.. ప్రివెంటివ్ అరెస్టు చేశారు. రమద హోటల్లో బస చేసి ఉన్న శాసన సభ్యులను కలుసుకునేందుకు ఆయనను వారు అనుమతించలేదు. అలాగే ఆయనను ఆహ్వానించడానికి వఛ్చిన కర్నాటక కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి డీ.కె.శివకుమార్ ని కూడా అరెస్టు చేశారు. ఎమ్మెల్యేలను తాను కలుసుకుని తీరుతానంటూ రోడ్డు పైనే ధర్నాకు కూర్చున్న దిగ్విజయ్ సింగ్ పట్ల ఖాకీలు.. ఒక సీనియర్ నేత, మాజీ సీఎం అన్న గౌరవం కూడా లేకుండా దురుసుగా ప్రవర్తించారు. ఫేస్ మాస్కు ధరించి కూర్చున్న ఆయనను భుజాలపైకి ఎత్తుకుని బలవంతంగా లాక్కుపోతున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి.

ఆ తరువాత వరుసగా ట్వీట్లు చేసిన దిగ్విజయ్.. తనను గాంధేయవాదిగా చెప్పుకున్నారు. ఈ ఎమ్మెల్యేల భద్రతకు తాను ప్రమాదకరమైన వ్యక్తినేమీ కానని, వారిని బీజేపీ బందీలుగా ఉంచిందని ఆరోపించారు.  5 గురు ఎమ్మెల్యేలతో తాను వ్యక్తిగతంగా మాట్లాడానని, తాము బందీలుగా ఉన్నామని, తమ సెల్ ఫోన్లు లాక్కున్నారని వారు చెప్పారని ఆయన వెల్లడించారు. ప్రతి ఎమ్మెల్యే వెంట సెక్యూరిటీ గార్డులు అనుక్షణం కాపలా ఉన్నారని  దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు.