#Tablighi Jamaath 161లో 140 మంది వాళ్ళే… స్వచ్ఛందంగా రాకపోతే అధోగతే

|

Apr 03, 2020 | 12:09 PM

ఏపీలో ఒక్కసారిగా పెరిగిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రాష్ట్ర ప్రజలను ఉలిక్కిపడేలా చేశాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాయి. పరిస్థితి అలార్మింగ్‌గా వుందని పాలకులకు గుర్తు చేశాయి. అయితే..

#Tablighi Jamaath 161లో 140 మంది వాళ్ళే... స్వచ్ఛందంగా రాకపోతే అధోగతే
Follow us on

More corona positive cases in Andhra Pradesh: ఏపీలో ఒక్కసారిగా పెరిగిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రాష్ట్ర ప్రజలను ఉలిక్కిపడేలా చేశాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాయి. పరిస్థితి అలార్మింగ్‌గా వుందని పాలకులకు గుర్తు చేశాయి. అయితే.. ఏపీలో సడన్‌గా కారోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడానికి కారణమేంటి? అందుకు ఎవరి నిర్లక్ష్యం దారితీసింది. ఇపుడీ చర్చ ఊపందుకుంది. దానికి సంబంధించిన గణాంకాలను తాజాగా రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసింది.

శుక్రవారం (ఏప్రిల్ 3వ తేదీ) మధ్యాహ్నం 12 గంటల వరకు వున్న కేసుల పూర్వాపరాలను పరిశీలిస్తే.. ఏపీలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 161. అందులో 140 మంది మార్చి 13 నుంచి 15వ తేదీ వరకు ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిఘీ జమాత్ సదస్సుకు వెళ్ళి వచ్చినవారు, వారికి సంబంధించిన వారు. ఏపీ నుంచి ఢిల్లీ సదస్సుకు మొత్తం 1085 మంది వెళ్ళి వచ్చినట్లు తాజాగా వెల్లడైన గణాంకాల ద్వారా తేలింది. వీరిలో ప్రస్తుతం రాష్ట్రంలో వున్న వారు 946 మంది కాగా.. వారిలో 881 మందికి కరోనా వైరస్ టెస్టులు పూర్తి చేశారు.

881 మందికి కరోనా వైరస్ టెస్టులు నిర్వహించగా.. అందులో 108 మందికి కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలింది. జమాతేకు వెళ్లిన వారి కుటుంబ సభ్యులు, వారితో కాంటాక్ట్‌ అయినవారిని గుర్తించి 613 మందికి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించగా.. అందులో 32 మందికి పాజిటివ్‌గా తేలింది. అంటే నిజాముద్దీన్ సదస్సుకు వెళ్ళిన వారిలో 108 మంది, వారితో కాంటాక్ట్ అయిన వారిలో 32 మంది మొత్తం 140 మంది డైరెక్టుగాను, ఇండైరెక్టుగాను నిజాముద్దీన్ తబ్లీఘ్ సదస్సు ద్వారా కరోనా వైరస్ బారిన పడిన వారే. తాజా గణాంకాల ప్రకారం ఏపీలో నెల్లూరు జిల్లాలో అత్యధికంగాను, కృష్ణా జిల్లా రెండో స్థానంలో వుంది. విజయవాడ నగరంలో 18 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

నిజాముద్దీన్ సదస్సుకు వెళ్ళిన వారిలో ఇంకా రెండు వందల మంది పరిస్థితి తేలాల్సి వుండగా.. వారిలో టెస్టులు పూర్తి అయిన వారికి సంబంధించిన రిపోర్టులు శుక్రవారం వచ్చే అవకాశాలున్నాయి. మిగిలిన వారు ఎక్కడ వున్నారనే విషయంపై ఏపీ ప్రభుత్వం వేట కొనసాగిస్తోంది. అయితే.. మతపరమైన సున్నితాంశాలకు ఏపీ ప్రభుత్వం వెనుకంజ వేస్తున్నట్లుగా చెప్పుకుంటున్నారు. అయితే.. మెజారిటీ ప్రజల ఆరోగ్యం, జీవితాలపై ఆధారపడి వున్నందున జమాత్ సదస్సుకు వెళ్ళి వచ్చిన వారిని వెతికిపట్టుకుని బలవంతంగానైనా పరీక్షలు జరపాలని ప్రజలు కోరుతున్నారు.