ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ షాక్

| Edited By: Anil kumar poka

Apr 23, 2020 | 1:47 PM

దేశమంతా కరోనా భయంతో విలవిల్లాడుతున్న తరుణంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాకిచ్చారు. గతంలో ప్రకటించిన కరువు భత్యం (డీఏ)ను రద్దు చేశారు.

ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ షాక్
Follow us on

దేశమంతా కరోనా భయంతో విలవిల్లాడుతున్న తరుణంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాకిచ్చారు. గతంలో ప్రకటించిన కరువు భత్యం (డీఏ)ను రద్దు చేశారు. ఈ మేరకు ప్రధాని ఇచ్చిన ఆదేశాలతో కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు గురువారం మధ్యాహ్నం వెలువడ్డాయి.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గతంలో పెంచిన డీఏను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. జులై 2021 వరకు పెంచిన డీఏ పెంపు నిలుపేశారు. 2020 జనవరి 1 నుంచి 2021 జూన్ 30 వరకు డీఏ బకాయిల చెల్లింపు కూడా ఉండదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అప్పటి వరకు ప్రస్తుతం ఉన్న డీఏ మాత్రమే కొనసాగుతుందని తెలిపారు. ఈ నిర్ణయం ప్రభావం దేశవ్యాప్తంగా వున్న కోటీ 30 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లపై వుంటుందని భావిస్తున్నారు. కరువు భత్యం నిలుపుదల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి 14 వేల 510 పది కోట్ల రూపాయలు ఆదా అవుతాయని అంఛనా.

కరోనా ప్రభావంతో దేశంలో పలువురి వేతనాల్లో కోత విధించిన దరిమిలా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో సైతం కోత విధిస్తారని ప్రచారం జరిగింది. అయితే, వేతనాల కోతకు మోదీ మొగ్గు చూపలేదు. కానీ, ప్రభుత్వంపై పెరుగుతున్న భారాన్ని ఎంతో కొంత తగ్గించుకునేందుకు కరువు భత్యంలో కోత మాత్రం విధించారు. అయితే, తదుపరి నిర్ణయం జరిగే దాకా ఈ నిలిపి వేసిన డీఏను చెల్లించబోరని సమాచారం.