#Helping hands ఏపీకి మేఘా విరాళం… ఎంతంటే?

|

Mar 27, 2020 | 4:26 PM

కరోనా వైరస్ నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలకు ప్రముఖులు చాలా మంది స్పందిస్తున్నారు. సినీ, రాజకీయ వర్గాలు పెద్ద ఎత్తున ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రుల సహాయ నిధికి పెద్ద ఎత్తున విరాళాలను ప్రకటిస్తూ వున్నారు.

#Helping hands ఏపీకి మేఘా విరాళం... ఎంతంటే?
Follow us on

MEIC big donation to AP CMRF: కరోనా వైరస్ నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలకు ప్రముఖులు చాలా మంది స్పందిస్తున్నారు. సినీ, రాజకీయ వర్గాలు పెద్ద ఎత్తున ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రుల సహాయ నిధికి పెద్ద ఎత్తున విరాళాలను ప్రకటిస్తూ వున్నారు. ఈ క్రమంలోనే ముందుకొచ్చింది మేఘా ఇంజీనిరింగ్ కంపెనీ. కరోనా నియంత్రణకు కృషి చేస్తున్న ఏపీ ప్రభుత్వాన్ని మెగా ఇంజనీరింగ్ సంస్థ అభినందించింది.

కరోనా నియంత్రణలో పాలుపంచుకుంటున్న ప్రభుత్వ వర్గాలకు దాతల విరాళాలు కొంత ఎంకరేజ్‌మెంట్‌గా కలసి వస్తున్నాయి. ఈ నిధులపైనే ప్రభుత్వాలు పూర్తిగా ఆధారపడే పరిస్థితి లేకపోయినా.. ఇలాంటి విరాళాలు వారికి సమాజం పట్ల ఉన్న ప్రేమాభిమానాలను, బాధ్యతను చాటుతాయి. సరిగ్గా ఇలా ఆలోచించే మేఘా ఇంజనీరింగ్ సంస్థ ఏపీ ప్రభుత్వానికి 5 కోట్ల రూపాయలు విరాళంగా అంద జేసింది. ముఖ్యమంత్రి సహాయనిధికి ఈ అయిదు కోట్ల రూపాయలు అందచేసింది.

మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ సిఎంఆర్ఎఫ్‌కు రూ.5 కోట్ల విరాళం ప్రకటించింది. దీనికి సంబంధించిన చెక్కును సంస్థ ఎండి పివి కృష్ణారెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసులో ముఖ్యమంత్రి జగన్‌కు అందజేశారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. మేఘా గ్రూప్ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. దీంతో పాటు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న పోలీసు, ఇతర సహాయక సిబ్బందికి ఉచితంగా భోజన సౌకర్యం కల్పిస్తామని మేఘా సంస్థ ప్రకటించింది.