వరద బాధితులకు ‘మేఘా‘ సాయం.. సీఎంఆర్ఎఫ్‌కు పదికోట్లు

అనూహ్య వరదలతో అతలాకుతలమైన హైదరాబాద్ ప్రజలను ఆదుకునేందుకు పలు సంస్థలు ముందుకొస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపుతో అందరికంటే ముందుగా స్పందించిన మేఘా సంస్థ భారీ విరాళాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇవ్వనున్నది.

వరద బాధితులకు ‘మేఘా‘ సాయం.. సీఎంఆర్ఎఫ్‌కు పదికోట్లు
Follow us

|

Updated on: Oct 19, 2020 | 4:58 PM

Megha announced huge donation to CMRF:  తెలుగు రాష్ట్రాలతోపాటు జాతీయ స్థాయిలో పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను నిర్మిస్తున్న మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (MEIL) సంస్థ తెలంగాణలో వరద బాధితుల సహాయార్థం భారీ విరాళాన్ని ప్రకటించింది. భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు ముందుకు రావాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు ఇచ్చిన పిలుపు మేరకు మేఘా సంస్థ వెంటనే స్పందించింది. సీఎం సహాయనిధికి (CMRF) పది కోట్ల రూపాయల విరాళం ప్రకటించింది.

వరద బాధితులకు అండగా నిలిచి, ప్రభుత్వ సహాయక చర్యలకు అండగా ఉండేందుకు ఈ సహాయం ప్రకటించినట్లు మేఘా యాజమాన్యం తెలిపింది. ఆపద సమయంలో ప్రజలను ఆదుకునేందుకు తన వంతు బాధ్యతగా ఈ విరాళం ప్రకటిస్తున్నట్లు పేర్కొంది. వరద బాధితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారిని ఆదుకునేందుకు తీసుకుంటున్న చర్యలకు ఈ సహాయం తోడ్పడుతుందని అభిప్రాయపడింది.

మేఘా సంస్థ ప్రకటించిన భారీ విరాళం పట్ల సీఎంవో హర్షం వ్యక్తం చేసింది. కష్టంలో వున్న ప్రజలను ఆదుకోవడంలో అందరి కంటే ముందుగా స్పందించిన మేఘా సంస్థ యాజమాన్యాన్ని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు అభినందించారు. బాధితులను ఆదుకునేందుకు ప్రతీ ఒక్కరు ముందుకు రావాలని ముఖ్యమంత్రి మరోసారి పిలుపునిచ్చారు.

Also read: హైద‌రాబాద్‌కు రూ. 550 కోట్లు: కేసీఆర్ ప్రకటన

Also read:  ఏపీలో మళ్ళీ ప్రజాభిప్రాయ సేకరణ… ఈసారి టాపిక్ ఇదే!

Also read: బహిరంగచర్చకు రెడీ.. బండికి హరీశ్ సవాల్

Also read: కిస్తులు కట్టిన వారికి త్వరలో మోదీ సర్కార్ శుభవార్త!

Also read: మళ్ళీ వర్షగండం… భయపడొద్దన్న కేటీఆర్

Also read: త్వరలో తెలంగాణకు కేంద్ర బ‌ృందం.. వెల్లడించిన కిషన్‌రెడ్డి