మసూద్ అజహర్ ఎక్కడున్నాడో నిజం బయటపెట్టిన పాక్..!

పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి, జైషే మహ్మద్ ఛీఫ్ మౌలానా మసూద్ అజహార్ విషయంలో పాకిస్తాన్ ఎట్టకేలకు నిజాన్ని అంగీకరించింది. మసూద్ అజహార్ తమ దేశంలోనే ఉన్నాడని పాక్ విదేశాంగ శాఖ ప్రకటించింది. మసూద్ అజహార్‌కు పుల్వామా దాడితో సంబంధం ఉందని భారత్ ఆధారాలు ఇస్తే చర్యలు తీసుకుంటామని పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషి తెలిపారు. మసూద్ అజహార్‌ను ఇప్పటికే అంతర్జాతీయ ఉగ్రవాదిగా పలు దేశాలు గుర్తించాయి. మసూద్ అజహార్ ఆరోగ్యం బాగా లేదని, బయటకు […]

మసూద్ అజహర్ ఎక్కడున్నాడో నిజం బయటపెట్టిన పాక్..!

Edited By:

Updated on: Mar 01, 2019 | 3:53 PM

పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి, జైషే మహ్మద్ ఛీఫ్ మౌలానా మసూద్ అజహార్ విషయంలో పాకిస్తాన్ ఎట్టకేలకు నిజాన్ని అంగీకరించింది. మసూద్ అజహార్ తమ దేశంలోనే ఉన్నాడని పాక్ విదేశాంగ శాఖ ప్రకటించింది. మసూద్ అజహార్‌కు పుల్వామా దాడితో సంబంధం ఉందని భారత్ ఆధారాలు ఇస్తే చర్యలు తీసుకుంటామని పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషి తెలిపారు.

మసూద్ అజహార్‌ను ఇప్పటికే అంతర్జాతీయ ఉగ్రవాదిగా పలు దేశాలు గుర్తించాయి. మసూద్ అజహార్ ఆరోగ్యం బాగా లేదని, బయటకు కూడా రాలేకపోతున్నారని పాక్ ప్రభుత్వం చెబుతోంది. ఖచ్చితమైన ఆధారాలు ఇవ్వకుంటే తాము మసూద్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేమని పాక్ ప్రభుత్వం కపట నాటకాలు ఆడుతోంది. మసూద్ అజహార్ పాక్ లోనే తిష్టవేశాడని, కాశ్మీర్ పైకి టెర్రర్ బ్యాచ్ లను ఉసిగొల్పుతున్నాడని భారత్ పదేపదే చెబుతోంది.