మీరు చేసింది కంటితుడుపు చర్యే: మోడీపై లోకేశ్ ఫైర్

విజయవాడ: ప్రధాని మోడీ విశాఖ పర్యటన నేపధ్యంలో ఏపీ మంత్రి నారా లోకేశ్ విమర్శలు చేశారు. ఏపీకి రైల్వే జోన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కేవలం కంటి తుడుపు చర్యేనని అన్నారు. రూ. 6,500 కోట్ల ఆదాయాన్ని లేకుండా చేశారని మండిపడ్డారు. ఇప్పుడు మాటలు చెప్పి మాకు అయిన గాయంపై కారం చల్లేందుకు వస్తున్నారని లోకేశ్ విమర్శించారు. రూ. 6,500 కోట్ల ఆదాయాన్ని తప్పించి రైల్వే జోన్ ఇచ్చారన్న విషయం ప్రతి తెలుగు వ్యక్తికి తెలుసంటూ […]

మీరు చేసింది కంటితుడుపు చర్యే: మోడీపై లోకేశ్ ఫైర్

Updated on: Mar 01, 2019 | 3:01 PM

విజయవాడ: ప్రధాని మోడీ విశాఖ పర్యటన నేపధ్యంలో ఏపీ మంత్రి నారా లోకేశ్ విమర్శలు చేశారు. ఏపీకి రైల్వే జోన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కేవలం కంటి తుడుపు చర్యేనని అన్నారు. రూ. 6,500 కోట్ల ఆదాయాన్ని లేకుండా చేశారని మండిపడ్డారు. ఇప్పుడు మాటలు చెప్పి మాకు అయిన గాయంపై కారం చల్లేందుకు వస్తున్నారని లోకేశ్ విమర్శించారు. రూ. 6,500 కోట్ల ఆదాయాన్ని తప్పించి రైల్వే జోన్ ఇచ్చారన్న విషయం ప్రతి తెలుగు వ్యక్తికి తెలుసంటూ మోడీపై లోకేశ్ ఫైరయ్యారు. మోడీ మనల్ని మళ్లీ మోసం చేశారు, గో బ్యాక్ మోడీ హ్యాష్ ట్యాగ్‌లతో లోకేశ్ నిరసన తెలిపారు.