సడలింపులతో లాక్ డౌన్ 4.0 ? 30 సిటీలకు పరిమితమేనా ?

| Edited By: Anil kumar poka

May 17, 2020 | 5:01 PM

దేశంలో లాక్ డౌన్ 4.0 సోమవారం నుంచి ప్రారంభమవుతోంది. ఇది ఈ నెల 31 వరకు కొనసాగుతుంది. ఈ నాలుగో దశ లాక్ డౌన్ కొత్త నిబంధనలతో డిఫరెంట్ గా ఉంటుందని ప్రధాని మోదీ ఇదివరకే ప్రకటించారు..

సడలింపులతో లాక్ డౌన్ 4.0 ? 30 సిటీలకు పరిమితమేనా ?
Follow us on

దేశంలో లాక్ డౌన్ 4.0 సోమవారం నుంచి ప్రారంభమవుతోంది. ఇది ఈ నెల 31 వరకు కొనసాగుతుంది. ఈ నాలుగో దశ లాక్ డౌన్ కొత్త నిబంధనలతో డిఫరెంట్ గా ఉంటుందని ప్రధాని మోదీ ఇదివరకే ప్రకటించారు. దీనికి సంబంధించి కేంద్రం కొన్ని మార్దర్శకాలను విడుదల చేయనుంది. కంటెయిన్మెంట్ జోన్లలో తప్ప ఇతర జోన్లలో బస్సులు, క్యాబ్స్, ఆటోలను అనుమతించవచ్చు. ఫ్యాక్టరీలు, పరిశ్రమలు నడవ వచ్చు. ఎక్కువమంది ఉద్యోగులతో తిరిగి కార్యాలయాలు కళకళలాడవచ్ఛు. దేశ వ్యాప్తంగా రెడ్ జోన్లను కేంద్రం పునర్విచించే అవకాశాలున్నాయి. 12 రాష్ట్రాల్లో 30 నగరాలు ఇంకా కరోనా సమస్యతో అల్లాడుతున్నాయి. వీటిలో హైదరాబాద్, పూణే, ఢిల్లీ, సూరత్, అహమ్మదాబాద్, ఇండోర్ వంటి సిటీలు ఉన్నాయి. ఈ నగరాలపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టవచ్ఛు. ఇక ప్యాసింజర్ రైళ్లు నడవకపోయినా స్పెషల్ రైళ్లు యధాప్రకారం నడుస్తాయి. అలాగే దేశీయ విమానాలను పరిమితంగా అనుమతించే సూచనలున్నాయి.