బ్రేకింగ్: గ్రేటర్ పరిధిలో మళ్ళీ లాక్‌డౌన్ !

| Edited By: Pardhasaradhi Peri

Jun 28, 2020 | 4:26 PM

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరోసారి లాక్ డౌన్ విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా కామెంట్ చేయడంతో రాష్ట్రంలో మరోసారి లాక్ డౌన్ ఖాయమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

బ్రేకింగ్:  గ్రేటర్ పరిధిలో మళ్ళీ లాక్‌డౌన్ !
Follow us on

There is a scope of imposing lock-down in Greater Hyderabad once again: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరోసారి లాక్ డౌన్ విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా కామెంట్ చేయడంతో రాష్ట్రంలో మరోసారి లాక్ డౌన్ ఖాయమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో కరోనా వైరస్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్ ఈ మేరకు లాక్‌డౌన్‌పై ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విస్తరిస్తున్న కరోనా వైరస్‌ పరిస్థితులపై ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఆదివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. జిహెచ్ఎంసి పరిధిలో కరోనా నియంత్రించడానికి 15 రోజులపాటు లాక్ డౌన్ విధించాలని పలువురు వైద్య శాఖ అధికారులు ఈ సమీక్షలో ముఖ్యమంత్రికి సూచించారు. అయితే.. లాక్ ‌డౌన్ విధింపు అనేది చాలా పెద్ద నిర్ణయం అవుతుందని మరికొంత కాలం వేచి చూడాల్సిన అవసరం వుందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.

‘‘ లాక్‌డౌన్ విధించాలంటే అందుకు ప్రజలను సన్నద్ధం చేయాలి, పోలీసు యంత్రాంగాన్ని సిద్ధం చేయాలి, క్యాబినెట్ సమావేశం పరచాలి.. అందుకే రెండు, మూడు రోజులు పరిస్థితిని గమనించి లాక్ డౌన్‌పై నిర్ణయం తీసుకుంటాం…దేశవ్యాప్తంగా కరోనా పెరుగుతుంది.. అదే క్రమంలో తెలంగాణలో కూడా కేసులు పెరుగుతున్నాయి… జాతీయ సగటుతో పోలిస్తే తెలంగాణలో మరణాల సంఖ్య తక్కువే… ఆందోళన చెందాల్సిన అవసరం లేదు… ప్రభుత్వ ఆసుపత్రి లతోపాటు, ప్రైవేట్ లోనూ వేలాది బెడ్స్ రెడీ చేశాం.. ’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షలో కీలక కామెంట్లు చేసినట్లు సమాచారం.