ప్రతి ఒక్క నీటి చుక్క ఒడిసి పట్టుకోవాలి: కేటీఆర్

|

Feb 28, 2020 | 5:09 PM

ప్రతి ఒక్క నీటి చుక్కను ఒడిసి పట్టుకుని కాపాడుకోవాలన్నారు మంత్రి కేటీఆర్. వర్షాకాలానికి ముందే ప్రజల్లో నీటి సంరక్షణపై చైతన్యం తీసుకురావాలని అధికారులకు సూచించారు.

ప్రతి ఒక్క నీటి చుక్క ఒడిసి పట్టుకోవాలి: కేటీఆర్
Follow us on

ప్రతి ఒక్క నీటి చుక్కను ఒడిసి పట్టుకుని కాపాడుకోవాలన్నారు మంత్రి కేటీఆర్. వర్షాకాలానికి ముందే ప్రజల్లో నీటి సంరక్షణపై చైతన్యం తీసుకురావాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ లోని జలమండలి రెయిన్‌ వాటర్‌ హార్వెస్టింగ్‌ థీమ్‌ పార్క్‌ను మంత్రి కేటీఆర్‌ సందర్శించారు. విద్యార్థులు, ప్రజల్లో వాటర్‌ హార్వెస్టింగ్‌పై చైతన్యం కలిగించేలా థీమ్‌ పార్క్‌ను జలమండలి రూపొందించింది. థీమ్‌ పార్క్‌లో ఏర్పాటు చేసిన 42 నీటి సంరక్షణ పద్ధతులను మంత్రి పరిశీలించారు. జలమండలి సిబ్బంది ప్రత్యేక యూనిఫామ్‌ జాకెట్‌ను మంత్రి ఆవిష్కరించారు. అదేవిధంగా డబ్ల్యూఏఎల్‌సీకి సంబంధించిన క్షేత్రస్థాయి రిజిస్టర్‌ను ఆవిష్కరించారు. జలమండలి ఆధ్వర్యంలోని పలు ప్రాజెక్టులు, కార్యక్రమాలపై కేటీఆర్‌ సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వాటర్‌ హార్వెస్టింగ్‌ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టేందుకు తగిన కార్యక్రమాలు చేపట్టాలన్నారు.